Ring Worm ( తామర , గజ్జి ) లక్షణాలు , తగ్గాలంటే ఏం చేయాలి ?

రింగ్ వార్మ్ ను తామర , గజ్జి అని కూడా పిలుస్తూ ఉంటారు. తామర అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. తామర చర్మం లేదా తలపై ఏర్పడుతుంది , ఎక్కువగా గజ్జలు, సంక, బొడ్డు ,పిరుదులు , పాదాల పైన, వేల మధ్యలో వస్తూ ఉంటుంది.

తామర ఎవరిలో ఎక్కువగా వస్తుంది :

  • చిన్నపిల్లలు
  • వెచ్చని వాతావరణం (ఎండాకాలం)
  • రోగ నిధుల శక్తి తక్కువగా ఉన్న వారు
  • కబడ్డీ రెస్లింగ్ వంటి క్రీడలు ఆడేవారు
  • బరువు ఎక్కువగా ఉన్నవారు

చిన్నపిల్లలు తొందరలో స్నానం చేసిన తర్వాత సరిగా తుడుచుకోకుండా తడిగా ఉన్నప్పుడు వెంటనే బట్టలు వేసుకునే వారిలో , అలాగే శుభ్రత పాటించని వారిలో తామర ఎక్కువగా వస్తుంది.

తామర ఎలా వ్యాప్తి చెందుతుంది :

తామర తొందరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. తామర వచ్చిన వ్యక్తిని తాకిన లేదా , వారు ఉపయోగించిన దుస్తులు ఉపయోగించిన, జంతువుల నుంచి, వస్తువుల నుంచి తామర వ్యాప్తి చెందుతుంది.

తామరలో దద్దుర్లు ఎలా ఉంటాయి :

తామర యొక్క దద్దుర్లో కేంద్రభాగం స్పష్టంగా ఉంటుంది, చుట్టూ చిన్న చిన్న ఎర్రటి దద్దుర్లు ఉంటాయి.

తామర అనేది వలయ కారంలో విస్తరిస్తుంది కాబట్టి వీటిని రింగ్ వార్మ్ అని కూడా అంటారు.

తామర లక్షణాలు ఎలా ఉంటాయి :

  • చర్మం : తామర అనేది చర్మంపై ఉన్నట్లయితే దద్దుర్లు ఏర్పడతాయి తీవ్రమైన దురద ఉంటుంది.
  • తల : తామర తల భాగంలో ఏర్పడినట్లయితే జుట్టు రాలిపోతుంది కొన్ని భాగంలో చిన్న చిన్న ప్యాచెస్ ఏర్పడతాయి అలాగే దురద చాలా ఉంటుంది.
  • పాదాలు : తామర అనేది వేల మధ్యలో ఏర్పడుతుంది క్రమంగా పగుళ్లు దురద ఉంటాయి.

తామర వచ్చిన వారు “డర్మటాలజిస్ట్” డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది .

తామర చికిత్స విధానం :

తామర అనేది తక్కువ ఉన్నట్లయితే Cotrimazole, Ketaconazole, Itracanazole వంటి యాంటీ ఫంగల్ క్రీమ్స్ ( Candid cream, KZ cream ) ఉపయోగించమని వైద్యులు సూచిస్తారు.

తామర తగ్గిన తర్వాత కూడా ఈ క్రీమ్స్ అనేవి సుమారు ఒకటి నుంచి రెండు వారాల వరకు ఉపయోగించాలి. ఇలా చేయకపోతే తామర మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది.

తామర తీవ్రంగా ఉన్నట్లయితే యాంటీ ఫంగల్ టాబ్లెట్స్ ( Syscan 150 mg ) ప్రతిరోజు ఒకటి మధ్యాహ్నం తిన్న తర్వాత ఉపయోగించాలి .ఇలా సుమారు నాలుగు రోజుల వరకు ఉపయోగించాలి.

తామర ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి :

  • శుభ్రత పాటించాలి.
  • తామర వచ్చిన వ్యక్తి వస్తువులు ఇతరులు ఉపయోగించకూడదు పంచుకోకూడదు.
  • తామర సోకిన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
  • దిగుతుగా ఉండే బట్టలు కాకుండా పొడిగా గాలి వచ్చి బట్టలు ధరించాలి.
  • బెడ్ షీట్స్ క్రమంగా మార్చుతూ ఉండాలి.
  • బట్టలు, లోదుస్తులు అనేవి వేడినీళ్లలో ఉతికి ఆరేయాలి.
  • స్నానం చేసిన తర్వాత టవల్తో శరీరం బాగా తుడిచిన, ఆరిన తర్వాత బట్టలు ధరించాలి.

మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :

తామర, గజ్జి ,దురద లక్షణాలు, చికిత్స విధానం

Leave a Comment

Exit mobile version