* రాగి జావా లేదా రాగి అంబలి పురాతన కాలం నుంచి ఉపయోగించే మంచి పోషకవిలువలు ఉన్న హెల్త్ డ్రింక్.
* వీటిలో పీచు అలాగే ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రతి రోజూ తీసుకోవడం వలన ,బరువు తగ్గడానికి సహాయ పడుతుంది.
* అలాగే జీర్ణం త్వరగా అవడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి రాగి అంబలి చాలా సహాయపడుతుంది.
* వీటిలో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల దృఢత్వానికి
* అలాగే ఐరన్ ఎక్కువగా ఉండటం వలన అనేమియా, రక్తహీనత సమస్యతో బాధపడేవారికి రాగి జావా చాలా సహాయపడుతుంది.
* రాగి జావా , రాగి అంబలి లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అందువలన ఇవి తీసుకోవడం వలన జుట్టు ఊడటం తగ్గుతుంది అలాగే జుట్టు తెల్లబడటం కూడా తగ్గిస్తూ ఉంటుంది.
* రాగి జావ , రాగి అంబలి లో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు ఈ రాగి అంబలి తీసుకోవడం వలన శరీరంలో ఉన్న చక్కెర శాతం తగ్గించడానికి ఈ అంబలి ఉపయోగపడుతుంది.
* శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి మంచి కొలెస్ట్రాల్ ని పెంచడానికి రాగి జావా సహాయపడుతుంది.
* వీటిలో విటమిన్ ఇ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండడం వల్ల చర్మ సౌందర్యానికి ,చర్మం కాంతివంతంగా ఉండడానికి అలాగే క్యాన్సర్ రాకుండా ఉండడానికి రాగి జావ చాలా సహాయపడుతుంది
* రాగి జావా, రాగి అంబలి లో మెగ్నీషియం ఉంటుంది అందువలన గుండె సంబంధిత ఆరోగ్యానికి అలాగే నరాలకి ఈ అంబలి చాలా ఉపయోగకరం.
రాగి అంబలి ,రాగి జావ ఎవరు తీసుకోకూడదు?
* రాగి జావా, రాగి అంబలి లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది అందువలన కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడేవారు ఈ రాగి అంబలి తీసుకోకూడదు
* రాగి జావా, రాగి అంబలి లో గాయిట్రోజన్స్ ఎక్కువగా ఉంటాయి అందువలన థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూడా రాగి జావ తీసుకోకూడదు
* రాగి జావా, రాగి అంబలి ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపులో గ్యాస్ రావడం, విరోచనాలు ఇలాంటి దుష్ప్రావాలు వచ్చే అవకాశం ఉంటుంది.
మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి.