టైఫాయిడ్ జ్వరం ఉన్నవారు తినవలసిన ,తినకూడని ఆహారాలు !!!

టైఫాయిడ్ జ్వరం సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వలన వస్తుంది. టైఫాయిడ్ జ్వరం నీ “ఎంటేరిక్ ఫీవర్” అని కూడా అంటారు,ఎందుకంటే ఈ జ్వరం ఎక్కువగా జీర్ణ వ్యవస్థ కు ఆపాయం చేస్తుంది. అందువలన టైఫాయిడ్ ఉన్నవారు సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి.

టైఫాయిడ్ ఉన్నవారు తినవలసిన ఆహారం :

  • తక్కువ పీచు పదార్థాలు – పాల కూర, క్యారట్, వంకాయ, కాకరకాయ
  • కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్న ఇడ్లీ, కిచిడి, ఉప్మా, గుడ్లు.
  • ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పాలు, పెరుగు, పన్నీర్, పప్పు దినుసులు తీసుకోవాలి.
  • పండ్లలో నీరు ఎక్కువగా ఉన్న తొందరగా జీర్ణ మయ్యే పండ్లు – పుచ్చ కాయ, అరటి పండు,దానిమ్మ పండు, మోసంబి లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
  • కార్చి చల్లార్చిన నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
  • కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసం లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.

టైఫాయిడ్ జ్వరం ఉన్నవారు తినకూడని ఆహారాలు :

  • మసాలా ఆహారాలు – మిర్చి, మిరియాలు
  • ఆవకాయ పచ్చడి
  • నువ్వులు
  • వెల్లుల్లి
  • ఉల్లిపాయ
  • ఫ్రైడ్ ఫుడ్స్
  • పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న క్యాబేజ్, కాలి ఫ్లవర్, ముల్లంగి
  • ఐస్ క్రీం
  • కూల్ డ్రింక్స్
  • బయట ఆహారాలు
  • నూనె ఎక్కువగా ఉన్న ఆహారం
  • పాపాయి పండు
Best and worst foods for Typhoid

Leave a Comment

Exit mobile version