రాత్రిపూట పిక్కలు పట్టేసినప్పుడు తగ్గాలంటే ఏం చేయాలి|How to Reduce Calf Muscle Cramps at Home in Telugu.

పిక్కలు పట్టడం అనేది చాలా తరచుగా వచ్చే ఇబ్బంది. ఇది సడన్ గా చాలా తీవ్రమైన నొప్పి కొన్ని సెకండ్ నుంచి కొన్ని నిమిషాల వరకు వచ్చి పోతుంది.

పిక్కలు పట్టడానికి గల కారణాలు :

  • తీసుకున్న ఆహారంలో సరిపడా ఉప్పు లేకపోవడం
  • నీళ్లు తక్కువగా తాగడం (డీహైడ్రేషన్)
  • కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి కణజాలు లోపించడం
  • విటమిన్ “డి” విటమిన్ “బి12” విటమిన్ “ఈ” తక్కువగా ఉండడం
  • మనం రోజు చేసే పని కాకుండా తీవ్రమైన పనిచేయడం ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల కూడా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి
  • కొన్ని మెడికల్ ఇబ్బందులు వెన్నుపూస సమస్య, డిస్క్ సమస్య , రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడడం (Deep Vein Thrombosis),.
  • రక్తనాళాల్లో కొవ్వు చేసినట్లయితే కూడా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. ఈ ఇబ్బంది ఎక్కువగా షుగర్ వ్యాధి ఉన్నవారు ధూమపానం చేసేవాళ్ళు చూస్తూ ఉంటాం.
  • మందులు కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్ మందులు, సిప్రోఫ్లోక్సిజన్ వంటి యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా పిక్కలు పెట్టేస్తుంటాయి.

పిక్కలు పట్టడం ఎవరిలో ఎక్కువగా ఉంటాయి :

  • వయసు పై పడిన వాళ్ళు
  • గర్భవతులు
  • చాలా సమయం నిల్చోని , కూర్చునేవారిలో
  • కిడ్నీ సమస్య
  • షుగర్ వ్యాధి
  • థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో పిక్కలు ఎక్కువగా పట్టుకుంటాయి.

పిక్కలు పట్టేయడం లక్షణాలు :

పిక్కలు పట్టేసినప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి అనేది సుమారు కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది . నడవడంలో ఇబ్బంది పిక్కలు గట్టిగా అయిపోవడం వంటి లక్షణాలు చూస్తాము.

పిక్కలు పట్టడం అనేది చాలామందిలో చూస్తూ ఉంటాను .కానీ ఎవరికైతే వాపు ,చర్మం రంగు మారడం, స్పర్శ కోల్పోవడం ,తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు ఉన్నవారు ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది.

పిక్కలు పట్టడం నిర్ధారణ పరీక్షలు :

  • సి బి పి రక్త పరీక్ష
  • ఎలక్ట్రోలైట్ రక్త పరీక్ష
  • థైరాయిడ్ టెస్ట్
  • కిడ్నీ ఫంక్షన్ టెస్ట్
  • బ్లడ్ షుగర్ టెస్ట్
  • వాస్కులర్ డాలర్ అల్ట్రా సౌండ్
  • ఎలక్ట్రో మ
  • ఎం.ఆర్.ఐ పరీక్ష

పిక్కలు పట్టినప్పుడు వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి :

  • పిక్కలు పట్టినప్పుడు కాళ్ళను చాపాలి. ఇలా కాలు చాపిన తర్వాత పాదాలను మన వైపు వంచి పెట్టీ ఉంచాలి.ఎలా ఒక నిమిషం వరకు పెట్టీ ఉంచాలి. ఇలా చేతి తో కానీ టవల్ తో కానీ చేయాలి.

ఇలా చేయడం వల్ల కండరాలనేవి స్ట్రెచ్ అవుతాయి .ఆ తర్వత నెమ్మదిగ మర్ధన చేయాలి.

  • పిక్కలు పట్టుకున్నప్పుడు లేచి నిలబడడం పాదాలను నేలపై ఆనించడం అలాగే కాళ్ళను అటు ఇటు కదపడం వంటివి చేయాలి.
  • వాపు ఉన్నట్లయితే ఐస్ ప్యాక్ పెట్టుకోవడం లేదా కండరాలు తీవ్రంగా నొప్పి ఉన్నట్లయితే హీట్ ప్యాక్ పెట్టుకోవడం వంటివి చేయాలి.
  • పిక్కలు పట్టినప్పుడు కాలు అనేవి గుండె లెవెల్ కన్నా ఎత్తుగా పెట్టు కోవాలి.
  • నొప్పి తీవ్రంగా ఉన్నట్లయితే Ibuprofen నొప్పి మాత్రలు, మజిల్ రెలక్సంట్ వంటి టాబ్లెట్స్ ఉపయోగించాలి .

పిక్కలు పట్టకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు పాటించాలి :

  • నీళ్లు ఎక్కువగా తాగడం
  • ఆహారంలో సరిపడా ఉప్పు ఉండడం
  • మధుమేహం కంట్రోల్ ఉంచడం
  • సడన్ గా తీవ్రమైన వ్యాయామం చేయకుండా నెమ్మదిగా మెల్లిమెల్లిగా వ్యాయామం చేయడం.
  • మెగ్నీషియం సప్లిమెంట్స్ వంటివి ఉపయోగించిన కూడా రాత్రిపూట పిక్కలు పట్టకుండా నివారించవచ్చు.

మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :

Calf muscle cramps in telugu

5 thoughts on “రాత్రిపూట పిక్కలు పట్టేసినప్పుడు తగ్గాలంటే ఏం చేయాలి|How to Reduce Calf Muscle Cramps at Home in Telugu.”

  1. చాలా మంది కి ఉపయోగపడే విషయాలు హాస్పిటల్ కి వెళ్లి నా డాక్టర్ గారిని అందరూ అడగలేరు అందరు డాక్టర్లు ఓపికతో చెప్పరు ఇలాంటి విషయాలు మళ్లీ మళ్లీ చెప్తూండండి.
    ధన్యవాదాలు🙏

    Reply

Leave a Comment

Exit mobile version