చికెన్ పాక్స్ నీ అమ్మవారు , ఆటలమ్మ అని కూడా పిలుస్తారు. ఈ చికెన్ పాక్స్ “వారిసెల్లా జోస్టర్” అనే వైరస్ వలన వ్యాపిస్తుంది.
చికెన్ పాక్స్ ఎక్కువగా చిన్న పిల్లలలో వస్తుంది అలాగే ఎండ కాలంలో తరుచూ వస్తుంది.
చికెన్ పాక్స్ ఎలా వ్యాపిస్తుంది :
వైరస్ గాలిలొ నుంచి లేదా చికెన్ పాక్స్ వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గిన , ఆ వ్యక్తి యొక్క నీటి గుల్లలు నుంచి వచ్చే నీరుని తాకిన కూడా చికెన్ పాక్స్ వ్యాపిస్తుంది.
మొదటగా చికెన్ పాక్స్ వైరస్ ముక్కు నుండి శ్వాస కోశ వ్యవస్థ లోకి వెళ్తుంది. ఆ తర్వాత లింఫ్ గ్రంథులు లో క్రమంగా వృద్ధి చెంది రక్తం లో చేరి లక్షణాలు కనపడతాయి. వైరస్ శరీరం లోకి చేరిన 15 రోజుల తర్వాత లక్షణాలు కనపడతాయి.
చికెన్ పాక్స్ లక్షణాలు :
- జ్వరం
- తల నొప్పి
- ఒళ్ళు నొప్పులు
- గొంతు నొప్పి
- ఆకలి వేయకపోవడం లాంటి లక్షణాలు మొదటగా కనపడతాయి.
ఈ లక్షణాలు వచ్చిన తర్వాత చిన్న చిన్న ఎర్రటి దద్దుర్లు అనేవి మొహం పైన,చాతి,తల పైన వస్తాయి .
అవి క్రమంగా బుడిపె ,కురుపు లాగా మారి ఆ తర్వాత వీటిలో నీరు చేరి నీటి గుల్లలు గా మారుతాయి.
ఈ నీటి గుల్లలు అనేవి చికెన్ పాక్స్ లో ప్రత్యేకంగా ఉంటాయి. నీటి గుల్లలు అనేవి ఎర్రటి అడుగున నీటి బుగ్గలుగా ఉంటాయి. వీటినే మెడికల్ టెర్మినాలజీ లో ” Dew Drop on Rose Petals” అని అంటారు.
ఈ నీటి గుల్లలు అనేవి కొన్ని రోజులకు వీటి నుంచి ద్రవం అనేవి బయటకి వచ్చి ఎండిపోయి, రాలి పోయి క్రమంగా దద్దుర్లు లాగా మారుతాయి. అలాగే ఈ దద్దుర్లు చాలా దురద ఉంటాయి.
చికెన్ పాక్స్ నిర్ధారణ పరీక్షలు :
- చికెన్ పాక్స్ వ్యక్తి కి వచ్చిన నీటి గుల్లలు నుంచి డాక్టర్ నిర్ధారణ చేయ వచ్చు.
- PCR రక్త పరీక్ష.
- డైరెక్ట్ ఫ్లోర్ సెన్స్ యాంటీ బాడీ పరీక్ష
- ఇమ్మ్యున గ్లోబులిన్ ద్వారా చికెన్ పాక్స్ నిర్ధారణ చేయవచ్చు.
చికెన్ పాక్స్ చికిత్స విధానం :
* 12 ఏళ్ల లోపు పిల్లలకు చికెన్ పాక్స్ వాటంతిత అదే తగ్గుతుంది. ఎటువంటి చికిత్స అవసరం ఉండదు.
* 12 ఏళ్ల పై బడిన వారికి కొన్ని యాంటీ వైరల్ మెడిసిన్స్ ” ఏసైక్లోవిర్” ” వాలసైక్లోవిర్” వంటి టాబ్లెట్స్ ఇస్తారు.
* ఎక్కువగా దురద ఉన్నవారికి “Calamine Lotion” ,” Cetrizine” “Pramoxine Gel” ఉపయోగించ మని వైద్యులు సూచిస్తారు.
చికెన్ పాక్స్ రాకుండా నివారణ చర్యలు :
“MMRV Vaccine ” వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చికెన్ పాక్స్ నివారించ వచ్చు.
మొదటి డోస్ : 12- 15 నెలల పిల్లలకు వేస్తారు
రెండవ డోస్ : 4-6 ఏళ్ల పిల్లలకు వేస్తారు.
చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి :
- ఒకటి నుంచి రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలి
- చికెన్ పాక్స్ వచ్చిన వ్యక్తి కొంత దూరం పాటించాలి
- నీటి గుల్లలను పగలకొట్టకూడదు
- గోర్లు అనేది కట్ చేసుకోవాలి
- ఈ నీటి గుళ్లను గోకకూడదు
- ఎక్కువగా నీళ్లు ,మజ్జిగా, కొబ్బరి నీళ్లు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి.
- మసాలా పదార్థాలు, నూనె పదార్థాలు, నూనెలో వేయించిన ఆహారం తక్కువగా తీసుకోవాలి.
మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :