అపెండిక్స్ అనేది ఒక నిరుపయోగంగా ఉన్న అవయవం. ఇది పెద్ద పేగు నుంచి తోకాలా చిన్న గొట్టము లాగా బయటకు ఉంటుంది.ఈ అపెండిక్స్ కుడి వైపు ఉంటుంది. ఎప్పుడైన ఈ అపెండిక్స్ ఏదైనా కారణాల వలన వాపు వస్తుందో ఆ సందర్భాన్ని “ఆపెండిసైటిస్” అంటారు. ఈ ఆపెండిసైటిస్ ఎక్కువగా 10-30 ఏళ్ల వయసు వారిలో వస్తుంది.
అపెండిసైటిస్ రావడానికి కారణాలు :
- అపెండిక్స్ యొక్క లోపలి పొర ఏదైనా కారణాల వలన లింఫాయిడ్ గ్రంథులు వాపు వచ్చి అపెండి సైటిస్ వస్తుంది.
- పెద్ద పేగు లో మలము పేరుకుపోయినప్పుడు అపెండిక్స్ పైన ఒత్తిడి ఏర్పడి వాపు వస్తుంది.
- పారాసైట్ ఇన్ఫెక్షన్
అపెండిసైటిస్ లక్షణాలు :
- నాభి చుట్టూ నొప్పి మొదటగా మొదలవుతుంది, కొన్ని గంటలలో క్రమంగా ఈ నొప్పి అనేది కుడి వైపున దిగువ క్రింది భాగానికి చేరుతుంది.
- గాబరవడం
- వాంతులు
- జ్వరం
అపెండిసైటిస్ నిర్ధారణ పరీక్షలు :
- ఆ వ్యక్తికి వచ్చిన నొప్పి ప్రకారం వైద్యులు నిర్ధారిస్తారు. ఆపెండిసైటిస్ లో నొప్పి అనేది క్రింద కుడి భాగంలో ఉంటుంది అలాగే Rebound Tenderness ( అపెండిక్స్ ఉన్న చోట కొద్దిగా నొక్కి పెట్టీ బయటకి అంటే తీవ్రమైన నొప్పి వస్తుంది
- CBP రక్త పరీక్ష – తెల్ల రక్త కణాలు అనేవి 10000 కన్నా అధికంగా ఉంటాయి.
- మూత్ర పరీక్ష
- సీ.టీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్
అపెండిసైటిస్ చికిత్స విధానం :
అపెండిక్స్ అనేది నిరుపయోగంగా ఉండే అవయవం కాబట్టి ఎవరికైతే అపెండిక్స్ వాపు వస్తుందో అలాంటి వారు సర్జరీ ద్వారా లేదా లాప్రో స్కోపీ ద్వారా తీసి వేస్తారు.
మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :