తిమ్మిర్లు అనేవి ఏ వయసు వారికైనా వస్తాయి, కానీ ఎవరైతే ఎక్కువగా చాలా సమయం కూర్చుని ఉంటారు అలాంటి వారిలో చూస్తూ ఉంటాము.
అలాగే వయసు పైబడిన వారిలో, ప్రెగ్నెన్సీ , ధూమపానం, మద్యపానం ,థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో. అలాగే షుగర్ వ్యాధి, కాలేయ సంబంధిత ఇబ్బంది కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో ఎక్కువగా తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి.
తిమ్మిర్లు రావడానికి కారణాలు :
- డీహైడ్రేషన్
- పొటాషియం ,మెగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్స్ తగ్గడం
- విటమిన్ డి విటమిన్ ఈ ,విటమిన్ బి 12 లోపం
- రక్తహీనత
- ఉప్పు తక్కువగా తినేవారు
- కొన్ని మందులు- కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, సిప్రోఫ్లాక్సాసిన్ యాంటీబయాటిక్, ఐబుప్రొఫెన్ వంటి పెయిన్ కిల్లర్స్ ఉపయోగించడం
- వెన్నుముక సమస్యలు
- డీప్ వీన్ త్రంబోసిస్
తిమ్మిర్లు నిర్ధారణ పరీక్షలు :
- సి.బి.పి రక్తపరీక్ష
- విటమిన్ డి ,విటమిన్ బి 12 పరీక్ష
- ఎలక్ట్రోలైట్ పరీక్ష
- థైరాయిడ్ పరీక్ష
- బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్ష
- ఎలక్ట్రో మ
- తీవ్రంగా ఉన్నట్లయితే ఎంఆర్ఐ స్కాన్ చేయించమని డాక్టర్స్ సూచిస్తారు.
తిమ్మిర్లు చికిత్స విధానం :
- మొదటగా వైద్యులు విటమిన్ సప్లిమెంట్స్, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్. ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్స్ ఉపయోగించమని సూచిస్తారు.
- తీవ్రంగా ఉన్నట్లయితే Quinine Sulphate, Mexilitine , Baclofen వంటి మెడిసిన్స్ సూచిస్తారు.
తిమ్మిర్లు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి :
- ఎక్కువగా నీళ్లు తీసుకోవడం
- తినే ఆహారంలో తగినంత ఉప్పు ఉండేలా చూడాలి
- కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఆకుకూరలు, పాలకూర, పప్పులు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
- జామకాయ ,అరటిపండు ,బాదం వంటివి తినాలి.
- ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
- ఒకే చోట గంటలు తరబడి కూర్చోకుండా పది నిమిషాలకి ఒకసారి తిరుగుతూ ఉండాలి లేదా నిలబడాలి
- తిమ్మిరి వచ్చినప్పుడు కాళ్ళను మసాజ్ చేయడం, ఫోమ్ రోలర్, హాట్ వాటర్ బాత్ వంటివి చేయాలి.