Gastritis| గ్యాస్ట్రిక్ సమస్య కారణాలు , లక్షణాలు,నివారణ చర్యలు

జీర్నాశయం యొక్క లోపలి మ్యూకస్ పొర వాపు ఏర్పడిన లేదా ఇన్ఫ్లామేషన్ ఏర్పడిన ఆ సందర్భాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు.

గ్యాస్త్రైటీస్| గ్యాస్ట్రిక్ సమస్య కారణాలు

  • ఎక్కువగా నొప్పి మాత్రలు ఆస్పిరిన్, ఐబుప్రొఫెన్
  • ధూమపానం, మద్యపానం
  • విటమిన్ బి12 లోపం
  • హెచ్ పై లోరి ఇన్ఫెక్షన్
  • ఒత్తిడి
  • గ్యాస్ట్రో ఈసోఫిజియో రిఫ్లెక్స్ డిసీస్
  • కొన్ని ఆహారపు అలవాట్లు – సరైన సమయానికి అన్నం తినకపోవడం, అర్ధరాత్రులు అన్నం తినటం, త్వరగా తినడం, అధికంగా తినడం అన్నం అప్పుడప్పుడు తినకపోవడం.
  • సిట్రస్ ఎక్కువగా ఉన్న పండ్లు, గ్రేప్స్ ,నిమ్మకాయ, ఆరెంజ్ ఎక్కువగా తీసుకోవడం
  • బయటిక ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం
  • మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం
  • మిరపకాయలు ,క్యాప్సికం, గరం మసాలా, వెల్లుల్లి, ఉల్లిపాయ అలాగే పచ్చళ్ళు ఎక్కువగా తినడం
  • సరైన సమయానికి నిద్ర లేకపోవడం వలన కూడా గ్యాస్టిక్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు :

  • చాతిలో మంట
  • గుండెలో ఏదో ఇబ్బంది
  • బొడ్డు పై భాగంలో నొప్పి రావడం
  • అజీర్తి
  • పొట్ట ఉబ్బరం
  • తేన్పులు
  • గాబరవడం

గ్యాస్టిక్ సమస్య నిర్ధారణ పరీక్షలు :

  • ఎండోస్కోపి
  • హెచ్ పైలోరి పరీక్ష

గ్యాస్టిక్ సమస్య చికిత్స విధానం :

  • మొదటగా గ్యాస్ట్రిక్ సమస్య రావడానికి గల కారణాలు ప్రకారం చికిత్స విధానం ఉంటుంది.
  • హెచ్ పైలోరి సమస్యతో బాధపడే వారికి క్లారిత్రోమైసిన్ ,అమోక్సిసిలిన్+ మెట్రో నీడజోల్ లాంటి యాంటిబయాటిక్స్ వైద్యులు సూచిస్తారు
  • ఆసిడ్ సమస్యతో బాధపడే వారికి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఒమేప్రజోల్, రెబప్రజోల్, ప్యాంటప్రొజోల్
  • హెచ్ 2 బ్లాకర్స్ – ఫామిటిడిన్, సిమటిడిన్, రానిటీడిన్ లాంటి మెడిసిన్స్ వైద్యులు సూచిస్తారు

గ్యాస్ట్రిక్ సమస్య నివారణ చర్యలు :

  • మసాలా పదార్థాలు ,బయటి ఆహార పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
  • సిట్రస్ పండ్లు ,లెమన్ ,ఆరెంజ్ తక్కువగా తీసుకోవడం
  • ఆల్కలీన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఆకుకూరలు సొరకాయ పొట్లకాయ బీరకాయ లాంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి
  • బీన్స్, హోల్ గ్రైన్స్, ఆమ్లా ,వాము, అజ్వైన్ ఎక్కువగా తీసుకోవాలి.
  • రాత్రిపూట అన్నం తక్కువగా తినాలి
  • అన్నమనేది తొందర తొందరగా కాకుండా నెమ్మదిగా తినాలి.
  • ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
  • తిన్న వెంటనే పడుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా నివారించవచ్చు.

మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :

గ్యాస్ట్రిక్ సమస్య కారణాలు

Leave a Comment

Exit mobile version