విటమిన్ “డి” తక్కువగా ఉంటే కనపడే లక్షణాలు, టెస్ట్ రిపోర్ట్ ఎలా చదవాలి ?

Vitamin”డి” ని “సన్ షైన్ విటమిన్” అని కూడా పిలుస్తారు , ఎందుకంటే 90 % విటమిన్ డి సూర్య కిరణాలు నుంచి ఉత్పత్తి అవుతుంది.

విటమిన్ “డి” ఎవరిలో తక్కువ ఉంటుంది ?

  • ఎక్కువగా ఇంట్లో ఉన్న వారికి
  • ఇంట్లో నుండి పని చేసే వారికి
  • వయసు పై బడిన వారు
  • నల్లగా ఉన్నవారు
  • సన్ స్క్రీన్ లోషన్ ఎక్కువగా పెట్టే వారిలో
  • కిడ్నీ సమస్య ఉన్న వారు
  • లివర్/ కాలేయ సంబంధిత ఇబ్బంది ఉన్నవారిలో విటమిన్ ” డి ” తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

విటమిన్ “డి ” తక్కువగా ఉంటే ఎటువంటి లక్షణాలు కనపడతాయి ?

  • ఎముకల దృఢత్వం తగ్గుతుంది
  • నడుము నొప్పి
  • కండరాల నొప్పి
  • తొందరగా అలిసి పోవడం
  • తిమ్మిర్లు
  • జుట్టు ఊడి పోవడం లాంటి లక్షణాలు కనపడతాయి.

విటమిన్ “డి” నార్మల్ లెవెల్స్ ఎంత ఉండాలి ?

విటమిన్ “డి” లెవెల్స్ రక్తంలో “కేమి ల్యూమి నిసెన్స్” (CLIA ) అనే పద్ధతి లో చూస్తారు.

* విటమిన్ “డి” నార్మల్ లెవెల్స్ 30 – 100 ng/ml ఉండాలి.

* 10 ng/ml తక్కువగా ఉంటే వారికి విటమిన్ డి తక్కువగా ఉన్నట్టు.

* 10 – 30 ng/ml ఉన్నవారికి విటమిన్ డి లెవెల్స్ సరిపడా లేవు అని అర్దం.

* 100 ng/ml ఎక్కువ ఉన్నవారికి విటమిన్ “డి” నార్మల్ కన్నా అధికంగా ఉంది .

విటమిన్ “డి” టెస్ట్ రిపోర్ట్ ఎలా చదవాలి ?

Leave a Comment

Exit mobile version