* కిడ్నీ నీ తెలుగు లో మూత్ర పిండాలు అంటారు. మూత్ర పిండాలు శరీరంలొ పేరుకు పోయిన వ్యర్థాలు మూత్రం ద్వారా తొలగించడానికి ఉపయోగపడుతుంది.
* కిడ్నీ వ్యాధి ఉన్నవారు ఉప్పు తక్కువగా తినాలి. ప్రతి రోజు 1.5 గ్రా. లేదా ½ టీ స్పూన్ ఉప్పు తీసుకోవచ్చు.అన్ని రకాల ఉప్పులు కన్నా సైంధవ లవణం (కళ్లుప్పు) చాలా మంచిది.
* అలాగే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆవకాయ, ఫ్రైస్ , పిజ్జా చిప్స్ లాంటివి కూడా తగ్గించాలి.
* కిడ్నీలు శరీరంలొ ఉన్న పొటాషియం నిర్మూలించడానీకి సహాయ పడుతుంది. కానీ ఎప్పుడైతే కిడ్నీ లు పని చేయవో అలాంటి వారికి పొటాషియం లెవెల్స్ అధికంగా ఉంటాయి. అందువలన కిడ్నీ వ్యాధి ఉన్న వారు పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తగ్గించాలి.
* పొటాషియం ఎక్కువగా పాలకూర, టొమాటో,ఆలుగడ్డ, ముల్లంగి,బీట్ రూట్ లో ఎక్కువగా ఉంటుంది.అందువలన ఈ ఆహారాలు కొంచం తక్కువగా తినాలి..
* పండ్లలో అరటి పండు,ఆరెంజ్, పపాయ,కివి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువలన కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ పండ్లు తక్కువగా తినాలి..
* కిడ్నీ వ్యాధి ఉన్నవారు పొటాషియం తక్కువగా ఉన్న కూరగాయలు వంకాయ, క్యాబేజ్, కాలి ఫ్లవర్, ఉల్లి గడ్డ ,క్యారట్, సొర కాయ,బెండ కాయ, క్యాప్సికమ్ లాంటివి తీసుకోవచ్చు.
* కిడ్నీ వ్యాధి ఉన్నవారు పొటాషియం తక్కువగా ఉన్న పండ్లు ఆపిల్, జామ కాయ, పుచ్చ కాయ, గ్రేప్స్, స్ట్రా బెర్రీస్ తీసుకోవచ్చు.
* కిడ్నీ లు సాధారణంగా మనం ఆహారంలో తీసుకున్న ప్రోటీన్స్ ను BUN ( బ్లడ్ యూరియా నైట్రోజన్ ) గా మార్చి మూత్రం ద్వారా బయటికి పంపుతుంది. కిడ్నీ సమస్య ఉన్నవారు లో ఈ నైట్రోజెన్ పేరుకు పోతుంది.
* అందుకే కిడ్నీ సమస్య ఉన్నవారు ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న మాంస హారం ( చికెన్,మటన్,ఫిష్ ) పప్పు దినుసులు,పాలు , చీస్, పన్నీర్ లాంటివి తక్కువగా తినాలి.
* కిడ్నీ ఇబ్బంది ఉన్నవారు ఎక్కువగా కార్బో హైడ్రేట్ ఉన్న ఆహారం అంటే పోహా,కిచిడి , సాబూదాన ,ఉప్మా ,బ్రౌన్ రైస్, జొన్న రొట్టెలు ఎక్కువగా తినాలి
* కిడ్నీ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి.