PRP అంటే ప్లేట్ లెట్ రిచ్ ప్లాస్మా ( Platelet Rich Plasma ).
PRP లో గ్రోత్ ఫాక్టర్స్ అలాగే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వలన కొల్లేజన్ ఉత్పత్తి చేయడానికి అలాగే స్టెమ్ సెల్స్ ఉత్పత్తి చేయడానికి PRP చాలా సహాయ పడుతుంది.
పీఆర్పీ థెరపీ చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు , పుండు త్వరగా మానడానికి ఇలా చాలా రకాలుగా సహాయ పడుతుంది.
పీఆర్పి హెయిర్ ట్రీట్మెంట్ ఉపయోగాలు :
- జుట్టు పలచగా ఉన్నవారు
- జుట్టు ఎక్కువగా ఊడి పోయే వారికి
- జుట్టు తక్కువగా ఉన్నవారు
- జుట్టు దృఢత్వాన్ని పెంచడానికి ఈ పీఆర్పీ చాలా సహాయ పడుతుంది.
పీఆర్పీ థెరపీ ఎలా చేస్తారు ?
పీఆర్పీ థెరపీ అనేది 3 భాగాలుగా చేస్తారు.
Step 1 : ఎవరైతే ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ తీసంటునారో వారి నుంచి ఒక 10 ml రక్తం సేకరిస్తారు .
Step 2 : ఈ సేకరించిన రక్తాన్ని సెంట్రీఫ్యూజ్ చేస్తారు. ఇలా చేయడం వలన రక్తం మూడు భాగాలుగా విడిపోతుంది.ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా , ప్లేట్లెట్ పూర్ ప్లాస్మా అలాగే ఎర్ర రక్త కణాలు.
Step 3 : ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ని ఒక చిన్న సిరంజ్ లో తీసుకొని ఎక్కడైతే జుట్టు పల్చగా ఉందో అక్కడ ఈ ప్లాస్మా నీ ఇంజక్ట్ చేస్తారు.
పీఆర్పీ థెరపీ ఎవరు చెయించకూడదు ?
- రక్తం పల్చగా అయ్యే మందులు తీసుకునే వారు
- కాలేయ సంబంధిత ఇబ్బంది ఉన్నవారు
- ఇన్ఫెక్షన్
- ప్లేట్ లెట్ సంఖ్య తక్కువగా ఉన్నవారు ఈ థెరపీ చేయించుకోకూడదు.
పీఆర్పీ థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ :
పీఆర్పీ థెరపీ కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. కొందరికి ఇన్ఫెక్షన్ అవుతాయి.
పీఆర్పీ థెరపీ చేయించుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
పీఆర్పీ థెరపీ చేయించుకునే ముందు తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన తల పైన ఉన్న దుమ్ము , ధూళి పోతుంది. ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు.
పీఆర్పీ థెరపీ చేయించుకున్న తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ?
పీఆర్పీ థెరపీ చేయించుకున్న తర్వాత 3 రోజుల వరకు ఎటువంటి హెయిర్ స్ప్రే , హెయిర్ జెల్ , జుట్టు కి రంగు వేసుకోకూడదు.