అల్బెండజోల్ అనేది ఒక ఆంటీ పారసైటిక్ మెడిసిన్. శరీరంలో ఉన్న నులి పురుగులు, బద్దే పురుగు, కొంకే పురుగు లు తగ్గించే టాబ్లెట్ .
ఈ అల్బెండజోల్ మార్కెట్ లో ” Zentel 400 ” ; “Ben dex 400” అనే పేరు తో మందుల దుకాణం లో ఉంటుంది .
ఈ అల్బెండజోల్ టాబ్లెట్స్ అలాగే సిరుప్స్ రూపంలో ఉంటుంది.
అల్బెండజోల్ పిల్లలకు వచ్చే వార్మ్ ఇన్ఫెక్షన్ తగించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.
వార్మ్ ఇన్ఫెక్షన్(నులి పురుగులు ఇన్ఫెక్షన్) రావడానికి కారణాలు :
- మట్టిలో లేదా గడ్డి లో చెప్పులు లేకుండా నడవడం వలన ఈ నులి పురుగులు శరీరంలొ కి వచ్చే అవకాశం ఉంటుంది
- పిల్లలు మట్టిలో ఆడుకునప్పుడు నులి పురుగులు మట్టి నుంచి పిల్లల గోర్లు లోకి వెళ్ళి అక్కడనుంచి శరీరం లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ వస్తుంది.
- నులి పురుగులు ఎక్కువగా చెరువులు, నీళ్ల ట్యాంక్ లో ఉంటుంది. కలుషితమైన నీరు త్రాగడం లేదా కలుషితమైన నీళ్ళల్లో ఈత కొట్టడం వలన కూడా ఈ వార్మ్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
- ఉడకని మాంస హారం , సరిగా శుభ్రం చేయని కూరగాయలు నుంచి కూడా నులి పురుగులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.
వార్మ్ ఇన్ఫెక్షన్ లక్షణాలు :
- మల ద్వారం దగ్గర తీవ్రమైన దురద ఉండడం..ఎక్కువగా రాత్రికి పడుకునే సమయంలో ఉంటుంది
- తిన్న తరువాత కడుపులో నొప్పి ఉండదు
- బరువు తగ్గడం
- ఎత్తు పెరగక పోవడం
- రక్త హీనత
- ఆకలి ఉండక పోవడం
- అజీర్తి లాంటి లక్షణాలు కనిపిస్తాయి
అల్బెండజోల్ ఎంత మోతాదులో తీసుకోవాలి ?
* 2 సంవత్సారాలు కన్నా తక్కువ ఉన్న వారు – 200 mg టాబ్లెట్ తీసుకోవాలి.
* 2 – 14 సంవత్సారాలు ఉన్నవారు 400 మి ఉన్న 1 టాబ్లెట్ తీసుకోవాలి.
ఈ టాబ్లెట్ ప్రతి రోజు ఒక టాబ్లెట్ , తిన్న తరువాత రాత్రి పడుకునే సమయంలో తీసుకోవాలి. 3 రోజులూ ఈ అల్బెండజోల్ టాబ్లెట్ తీసుకోవాలి.
కొందరు వైద్యులు పిల్లలకు ప్రతి 6 నెలలకు ఈ అల్బెండజోల్ టాబ్లెట్ తీసుకొమ్మని సూచిస్తారు .
ఈ అల్బెండజోల్ టాబ్లెట్ తీసుకున్నాక గ్రేప్స్ అలానే గ్రేప్ జ్యూస్ తీసుకోకూడదు.
అల్బెండజోల్ టాబ్లెట్ దుష్ప్రభావాలు :
- గాబరవడం
- వాంతులు
- కడుపు నొప్పి
- తల నొప్పి
అల్బెండజోల్ టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు ?
- అలర్జీ
- ప్రెగ్నెన్సీ
- పాలు ఇచ్చే తల్లులు
- లివర్ సమస్య
- బోన్ మ్యారో సమస్య ( ఆప్లాస్టిక్ అనేమియా ) సమస్య ఉన్నవారు ఒకసారి డాక్టర్ నీ సంప్రదించి ఈ టాబ్లెట్ తీసుకోవాలి.