Primolut N ( పీరియడ్స్ నీ వాయిదా చేసే టాబ్లెట్) ఉపయోగాలు, దుష్ప్రభావాలు .

Primolut N టాబ్లెట్ లో నార్ ఎతిస్తీర్హోన్ 5 మి గ్రా ఉంటుంది.

Primolut N టాబ్లెట్

సాధారణంగా ఆడవారిలో ప్రోజేస్తీరోన్ హార్మోన్ ఉంటంది.ఈ ప్రోజేస్తీరోన్ ఓవ్యులేషన్,ఆలాగే నెలసరి రావడానికి సహాయ పడుతుంది. నార్ ఎతిస్తీర్హోన్ కృత్రిమంగా తయారు చేసిన హార్మోన్.

Periods postpone tablets

Primolut N టాబ్లెట్ ఉపయోగాలు :

  1. నెలసరి సమయంలో వచ్చే అధిక రక్తస్రావం తగ్గిస్తుంది
  2. నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన ఇబ్బంది, నొప్పి నీ తగ్గిస్తుంది.
  3. నెలసరి సరైన సమయానికి రానివారికి
  4. ఎండోమెట్రియాసిస్ సమస్యతో బాధపడేవారికి
  5. నెలసరి ఆలస్యంగా రావడానికి కూడా ఈ టాబ్లెట్ ఉపయోగ పడుతుంది.
  6. PCOS
  7. ప్రీ మెన్స్ర్రూవాల్ సిండ్రోమ్

Primolut N టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి:

* ఈ టాబ్లెట్ ఎన్ని రోజులు అలాగే ఎలా ఉపయోగించాలి అనేది వారికి ఉన్న సమస్య ప్రకారం ఉంటుంది.

* నెలసరి ఆలస్యంగా రావడానికి ఈ టాబ్లెట్ నెలసరి తేది కన్న మూడు రోజుల ముందు ఉపయోగించాలి. ప్రతి రోజు ఒకటి లేదా రెండు టాబ్లెట్స్ ఉపయోగించాలి. ఈ టాబ్లెట్ ప్రతీ రోజు అదే సమయంలో తీసుకోవాలి.

* అధిక రక్త స్రావం సమస్యతో బాధపడే వారు నెలసరి ఆయిపోయిన 5 నుంచి 25 రోజుల వారికి ప్రతి రోజు రెండు సార్లు ఈ టాబ్లెట్ తీసుకోవాలి.

* ప్రీ మెన్స్ర్రూవాల్ సిండ్రోమ్ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఒకటి టాబ్లెట్ తీసుకొవాలి.

* ఎండోమెట్రియాసిస్ సమస్యతో బాధపడేవారు 6-9 నెలలు ఈ టాబ్లెట్ తీసుకోవాలి.

Primolut N Tablet దుష్ప్రభావాలు :

ఈ టాబ్లెట్ కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ కానీ కొందరికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశo ఉంటుంది.

  1. గబారవడం
  2. కళ్ళు తిరగడం
  3. తల నొప్పి

Primolut N టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు :

  1. గర్భవతి ఉన్నవారు
  2. పాలు ఇచ్చే తల్లులు
  3. షుగర్ పేషంట్స్
  4. గుండె సమస్య ఉన్నవారు
  5. కాలేయ సంబంధిత ఇబ్బంది ఉన్నవారు ఈ టాబ్లెట్ తీసుకోకూడదు.
Primolut N Tablet

Leave a Comment

Exit mobile version