పచ్చ కామెర్లు ను “జాండిస్” అని కూడా పిలుస్తారు. రక్తంలో “బిలిరుబిన్” అనే పిగ్మేoట్ ఎక్కువ అవ్వడం వలన జాండిస్ వస్తుంది.
కామెర్లు ఎలా వస్తాయి :
సాధారణంగా ఎర్ర రక్త కణాలు 120 రోజులు బ్రతికి ఉంటాయి. ఆ తర్వాత చని పోతాయి. ఇలా అయిన తర్వాత ఎర్ర రక్తకణాలు లో ఉండే హీమోగ్లోబిన్ , హీమ్, అలాగె గ్లోబిన్ గా విడిపోయి హీమ్ అనేది బిలిరుబిన్ గా మారుతుంది.
ఈ బిలిరుబిన్ కాలేయం లోకి వెళుతుంది, కాలేయం నుంచి పిత్తాశయం, పిత్తాశయం నుండి క్లోమ గ్రంది ఆ తరువాత పేగు లోకి వెళ్లి అక్కడి నుంచి మలము లేదా మూత్రం ద్వారా శరీరం నుండి బయటకి వెళ్లి పోతుంది .
కానీ కొన్ని సందర్భాల్లో ఈ బిలిరుబిన్ శరీరంలో పేరుకు పోయి జాండిస్ వస్తుంది.
కామెర్లు|జాండిస్ రావడానికి కారణాలు :
- రక్తం లో ఇన్ఫెక్షన్ ( హీమొలిటిక్ అనీమియా , ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ )
- కాలేయ సంబంధిత ఇబ్బంది ( హెపటైటిస్ వైరస్ , బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, అధికంగా మధ్య పానం ,ఎక్కువగా మందులు వాడటం)
- పిత్తాశయంలో రాళ్లు
- క్లోమం గ్రంధి వాపు
- పేగు లో ఇబ్బంది లేదా క్యాన్సర్
- కొన్ని జన్యు పరమైన ఇబ్బంది ( Gilbert Syndrome, Dublin Johnson Syndrome )
జాండిస్ ఎక్కువగా అప్పుడే పుట్టిన పిల్లలు లో వస్తుంది . ఈ సందర్భాన్ని “నీయో నేటల్ జాండిస్ ” అంటారు.
జాండిస్ లక్షణాలు :
- చర్మం పసుపు పచ్చగా మారడం
- కళ్ళు పసుపచ్చగా ఉండడం
- మూత్రం పసుపచ్చగా రావడం
- దురద పెట్టడం
- పొట్ట వాపు
- ఆకలి వేయకపోవడం
- బరువు తగ్గడం
- జ్వరం లాంటి లక్షణాలు చూస్తాము
జాండీస్ నిర్ధారణ పరీక్షలు :
- క్లినికల్ గా చూడడం
- కొన్ని రక్త పరీక్షలు
- లివర్ ఫంక్షన్ టెస్ట్ ( LFT )
- బిలు రుభిన్ (Serum bilirubin )
- CBP ( ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్)
- మూత్ర పరీక్ష
- అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ ( USG Abdomen Scan )
- హెపటైటిస్ పరీక్ష
- సిటీ ,ఎంఆర్ఐ స్కాన్
జాండీస్ చికిత్స విధానం :
జాండీస్ యొక్క చికిత్స విధానం అనేది జాండీస్ రావడానికి గల కారణాలు ప్రకారం చికిత్స ఉంటుంది.
లివర్కు సంబంధిత ఇబ్బంది ఉన్నప్పుడు లివర్ కాలయం చికిత్స ; హెపటైటిస్ వలన జాండీస్ వచ్చినప్పుడు హెపటైటిస్ చికిత్స లేదా పిత్తాశయంలో రాళ్లు ఉంటే పిత్తాశయం నిర్మూలన లాంటి చికిత్స చేయడం జరుగుతుంది.
జాండీస్ ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి :
- రెస్ట్ తీసుకోవడం
- ఎక్కువగా నీళ్లు తాగడం
- ఆల్కహాల్ తగ్గించుకోవడం
- ఎక్కువగా టాబ్లెట్స్ : లివర్ కి ఇబ్బంది కలిగించే టాబ్లెట్స్ వాడకపోవడం
మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి :