Hemlich Maneuver|చిన్న పిల్లలు గొంతులో నాణేలు ఇరుకున్నపుడు చేసే ప్రథమ చికిత్స హెమ్లిచ్ మాన్యువర్

చిన్న పిల్లలు ఆడుకునే సమయంలో కొన్ని సందర్భాల్లో నాణేలు మింగుతూ ఉంటారు.ఈ నాణెం అనేది గొంతులో ఇరుక్కొని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. అలాగే పెద్దవారు ఏదైనా ఆహారం తిన్నపుడు కూడా గొంతులో ఇరుక్కోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో చేసే ప్రథమ చికిత్స నీ హెమ్లిచ్ మాన్యువర్ అంటారు.

ఒక సంవత్సరం పై బడిన వారికి హెమ్లిచ్ మాన్యువర్ ఎలా చేస్తారు ?

  • మొదటగా మనం చిన్నారి వెనక వైపు నిలబడాలి.

ఆ తర్వత ఒక చేతు అనేది పిడికిలి బిగించి ఇంకో చేతు పిడికిలి బిగించిన చేతి పై పెట్టాలి.

చేతులు పొట్ట భాగంలో పక్కటెముకలు క్రింద కొద్దిగా బొడ్డు పైన పెట్టాలి.

నెమ్మదిగ లోపలికి అలాగే పైకి కదుపుతూ ఉండాలి. ఇలా చేయడం వలన ఇరుక్కుపోయిన నాణెం బయటకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఏడాది లోపు పిల్లలకు హెమ్లిచ్ మాన్యువర్ ఎలా చేస్తారు ?

ఇలా చేయడం వలన కూడా ఇరుకున్న వస్తువు బయటకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఏడాది లోపు పిల్లలకు మొదటిగా మనం కూర్చిలో కూర్చొని పిల్లలను కాళ్ల పై బోర్లా పడుకోపీటాలి. చిన్నారి తల కింది వైపు ఉండేలా చూడాలి.

ఆ తర్వాత రెండు భూజల మధ్యగా వీపు వైపు బలంగా ఒత్తిడి కలిగించాలి.

ఇలా చేసిన కూడా ఇరుక్కున్న వస్తువు రానట్లయిటే చెస్ట్ త్రస్ట్ పద్ధతి చేయాలి.

Chest Thrusts

ఈ పద్ధతిలో మొదటిగా చిన్నారి నీ మన వైపు పడుకో పెట్టాలి. ఆ తర్వాత రెండు వేళ్ళతో ఛాతీ మధ్య భాగంలో కొద్దిగా కిందికి కదిలించాలి. ఇలా చేయడం వలన కూడా ఇరుక్కు పోయిన వస్తువు బయటకి వస్తుంది.

Leave a Comment

Exit mobile version