సిట్రజెన్ ఒక యాంటీ హిస్తమిన్ మెడిసిన్ . అలర్జీ తగ్గించే టాబ్లెట్.
సిట్రజెన్ టాబ్లెట్ ఉపయోగాలు :
- జలుబు
- తుమ్ములు
- ముక్కు దిబ్బడ
- ముక్కు కారడం
- హే ఫీవర్
- కంటి అలర్జీ ( కన్ను ఎర్ర బడడం,దురద )
- చర్మ అలర్జీ
- ఎగ్జిమా
- పురుగు కాటు
- తిండి అలర్జీ తగ్గించడానికి సిట్రజెన్ టాబ్లెట్ ఉపయోగించాలి.
సిట్రజెన్ టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి :
* సిట్రజెన్ టాబ్లెట్స్, లిక్విడ్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది.టాబ్లెట్స్ 10 మి.గ్రా ఉంటుంది. లిక్విడ్స్ 5g/ml, 1 mg/ml ఉంటుంది .
* 12 ఏళ్లు పై బడిన వారు సిట్రజెన్ 10 మి.గ్రా. టాబ్లెట్ ప్రతి రోజు ఒక టాబ్లెట్ తిన్న తర్వాత రాత్రి పూట తీసుకోవచ్చు .
* 6- 12 ఏళ్ల లోపు పిల్లలకు 5 మి.గ్రా టాబ్లెట్స్ తీసుకోవాలి.
* 2-5 ఏళ్ల లోపు పిల్లలకు 2.5 మి.గ్రా. టాబ్లెట్ ఉపయోగించాలి.
* సిట్రజెన్ టాబ్లెట్ మార్కెట్ లో అనేక రకాల బ్రాండ్ లో అందుబాటులో ఉంటుంది ( Okacet, Cetzin,Cerzin,Already,Zyrtec )
సిట్రజెన్ టాబ్లెట్ దుష్ప్రభావాలు :
- నిద్ర మబ్బు
- తల నొప్పి
- నోరు ఎండి పోవడం
- కళ్ళు తిరగడం
- విరోచనాలు
సిట్రజెన్ టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు :
- లివర్ వ్యాధి
- కిడ్నీ వ్యాధి
- మూర్చ వ్యాధి
- ప్రొస్టేట్ గ్రంథి సమస్య
- గర్భవతులు
- పాలు ఇచ్చే తల్లులు ఒకసారి డాక్టర్ నీ సంప్రదించి ఈ టాబ్లెట్ తీసుకోవాలి.