ముక్కులో నుంచి రక్తం వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని మెడికల్ టెర్మినాలజీలో “ఎపిస్తాక్సిస్” అని పిలుస్తారు.
ముక్కులో నుంచి రక్తం రావడానికి కారణాలు :
- ముక్కు ఎండిపోవడం
- ముక్కులో ఇబ్బంది
- తరచూ ముక్కులో వేలు పెట్టడం
- ముక్కుకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు
- ముగ్గులు ఏదైనా కణితులు ఉండడం
- ముక్కులో ఏదైనా వస్తువు ఇరుక్కుపోవడం వలన కూడా మొక్కలో నుంచి రక్తం అనేది వస్తుంది.
ముక్కు నుంచి రక్తం ఎవరిలో ఎక్కువగా వస్తుంది :
- రెండు నుంచి పది ఏళ్ల చిన్నారులు
- ఎక్కువగా క్రీడలు పాల్గొనే వారిలో
- అలర్జీస్
- శ్వాసకోశ వ్యవస్థ ఇబ్బంది ఉన్నవారు
- చలి లేదా ఎండ ఎక్కువగా ఉన్న వాతావరణం లో ఉండేవారు
- అధికంగా ముక్కు ఊదేవారిలో
- హిమోఫిలియా , వాన్ వీళ్లి బ్రాండ్ అనే రక్త సమస్యలు ఉన్నవారు
- వయసు పైబడిన వారు
- గర్భవతుల్లో ముక్కు నుంచి రక్తం రావడం తరచుగా చూస్తాం.
ముక్కులో నుంచి రక్తం రావడం అనేది రెండు రకాలుగా ఉంటాయి. ముక్కు ముందు భాగంలో ఉన్న రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ముక్కులో నుంచి రక్తం వస్తుంది ; కానీ కొందరికి మొక్కు వెనుక భాగంలో ఉన్న రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల రక్తమనేది ముక్కు నుంచి గొంతులోకి వెళ్లి నోటిలో రక్తం ఉంటుంది.
ముక్కులో నుంచి రక్తం రావడం వాటి నిర్ధారణ పరీక్షలు :
ముక్కు నుంచి రక్తం అనేది 5 నుంచి 15 నిమిషాల్లో తగ్గుతుంది కానీ ఎవరికైతే తీవ్రంగా రక్తస్రావం అలాగే 15 నిమిషాల తర్వాత కూడా రక్తస్రావం జరుగుతుందో అలాంటివారు చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ డాక్టర్ ని సంప్రదించాలి.
డాక్టర్ గారు ముక్కుని పరిశీలించడం అలాగే ఎండ్డోస్కోప్ ఎవరికైతే రక్త సమస్యలు ఉన్నాయో అలాంటివారికి రక్త పరీక్ష చేయించుకోమని సూచిస్తారు.
ముక్కు నుంచి రక్తం వచ్చినప్పుడు ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలి :
- మొదటగా ఆ వ్యక్తి నిటారుగా కూర్చోవడం లేదా నిల్చుకోవాలి.
- ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క తలను కొద్దిగా ముందుకి వంచమని చెప్పాలి ఇలా తల ముందుకు ఉంచడం వల్ల రక్తమనేది వెనక్కి వెళ్ళిపోకుండా మనం నివారించవచ్చు.
ఆ తర్వాత నేసల్ ఎముక కింది భాగంలో చూపుడువేలు అలాగే బొటనవేలు సహాయంతో 10 నుంచి 15 నిమిషాల వరకు ఒత్తి పెట్టి ఉంచాలి. ఇలా పెట్టడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది కావున శ్వాస అనేది ముక్కుతో కాకుండా నోటితో తీసుకోవాలి.
రక్తస్రావం తీవ్రంగా ఉన్నట్లయితే ముక్కు భాగంలో ఐస్ ప్యాక్ అనేది పెట్టుకోవాలి.
15 నిమిషాల తర్వాత కూడా అలాగే రక్తస్రావం జరుగుతున్నట్లయితే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది.
డాక్టర్ గారు ఆక్సిమటాసోలిన్ ఉన్న నైజం డికంజస్టెంట్, లేదా లిడోకేన్ , సిల్వర్ నైట్రేట్ కాటరీ ,థర్మల్ కాటరీ లాంటి చికిత్స చేస్తారు.
ముక్కులో నుంచి రక్తం రావడం తగ్గిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి :
- అధికంగా ముక్కుతో గాలి బయటకు ఊదకూడదు
- ముక్కులో వేలు పెట్టకూడదు
- మద్యపానం, ధూమపానం ఎక్కువగా వేడి పదార్థాలు రెండు రోజుల వరకు తీసుకోకూడదు.
- ఐభూప్రొఫైన్, మార్ఫిన్ లాంటి నొప్పి మాత్రలు తీసుకోకూడదు .తీవ్రంగా నొప్పి ఉన్నట్లయితే పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోవాలి.
మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :