మలేరియా ” ప్లాస్మోడియం” అనే ప్యారాసైట్ వలన వస్తుంది. ఇది దోమ కాటు వలన ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది.
మలేరియా లక్షణాలు :
- మలేరియా వచ్చినవాళ్లలో మొదటగా ఎక్కువగా వనకడం ఆ తర్వాత తీవ్రమైన జ్వరం ఉంటుంది. జ్వరం అనేది ఒకరోజు తీవ్రంగా ఉండి మరో రోజు నార్మల్ గా ఉంటుంది. జ్వరం తగ్గిన తర్వాత చెమటలు పట్టడం వంటి లక్షణాలు చూస్తాము.
- కండరాల నొప్పి
- తొందరగా అలసిపోవడం
- తలనొప్పి
- గాబరవడం
- వాంతులు
- విరోచనాలు
- గుండె వేగంగా కొట్టుకోవడం
- శ్వాస వేగంగా తీసుకోవడం
- నల్లగా మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మలేరియా తల్లి నుండి పుట్టబోయే బిడ్డకు, రక్త దానం, ఇతరులు ఉపయోగించిన సూదులు ద్వారా వ్యాప్తి చెందుతుంది.
మలేరియా నిర్ధారణ పరీక్షలు :
- బ్లడ్ స్స్మీయర్ టెస్ట్
- ELISA టెస్ట్
- CBP ( ఈ పరీక్షలో హీమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతాయీ, LDH ఎక్కువ అవుతాయి ).
మలేరియా చికిత్స విధానం :
- మలేరియా వచ్చిన వారిలో జ్వరం , నొప్పులు తగ్గడానికి ” పారా సిటమాల్” టాబ్లెట్స్ వైద్యులు సూచిస్తారు.
- తీవ్రంగా ఉన్నట్లయితే కొన్ని ఆంటీ మలరియల్ టాబ్లెట్స్ “Chloroquine” , ” Mefloquine” , Quinine, Primaquine, Aartemisinin వంటి టాబ్లెట్స్ వైద్యులు సూచిస్తారు.
మలేరియా సమస్యలు :
మలేరియా సరైన సమయంలో చికిత్స అందించకోతే కొన్ని తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
- మలేరియా మెదడు కి వ్యాపించి స సెరేబ్రల్ మలేరియా వచ్చే అవకాశం ఉంటుంది.
- శ్వాస కోశ వ్యవస్థ కు వ్యాపించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం
- రక్త హీనత
- రక్తంలో చక్కర లెవెల్స్ పడిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
మలేరియా నివారణ చర్యలు :
మలేరియా రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
- బయటకి వెళ్ళినప్పుడు పొడ వాటి బట్టలు ధరించడం
- బెడ్ నెట్స్ ( మంచానికి జాలిలు )
- ఒడామస్ వంటి చర్మం పై పెట్టుకోవడం
- Hit వంటి దోమలు తరిమి కొట్టే మందులు ఉపయోగించడం వలన మలేరియా రాకుండా మనం నివారించ వచ్చు.
మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి :