ఫుడ్ పాయిజన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎవరైతే కలుషిత ఆహారం తీసుకుంటారో అలాంటి వారికి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఫుడ్ పాయిజనింగ్ కారణాలు :
- కలుషిత ఆహారం తినడం
- ఎక్స్పైరీ గడువు ముగిసిన ఆహారం తినడం
- చేతులు శుభ్రంగా కడుక్కోకుండా తినడం
- ఉడకని ఆహారం, ఉడకని కూరగాయలు తీసుకోవడం
- చాలా రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారం తినడం
- ఉడకని మాంసాహారం
- కలుషితమైన నీళ్లు తాగడం వంటి కారణాలవల్ల ఫుడ్ పాయింజినింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఫుడ్ పాయిజనింగ్ ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము :
- చిన్నపిల్లల్లో
- గర్భవతులు
- వయసు పైబడిన వారు
- రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఫుడ్ పాయిసెనింగ్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.
ఫుట్ పాయిజనింగ్ లక్షణాలు :
- కడుపునొప్పి
- వాంతులు
- విరోచనాలు
- విరోచనాలలో రక్తం రావడం
- కడుపులో తిమ్మిర్లు
- జ్వరం
- తలనొప్పి లక్షణాలు కనబడతాయి
ఫుడ్ పాయిసెనింగ్ నిర్ధారణ పరీక్షలు :
- ఫుడ్ పాయిజనింగ్ ఉన్నవారికి లక్షణాల ప్రకారం ఒక నిర్ధారణకి వస్తారు. ఈ లక్షణాలతో పాటు కొన్ని రక్తపరీక్షలు వైద్యులు సూచిస్తారు.
- స్టూల్ ల్ శాంపిల్ టెస్ట్ ( మల పరీక్ష )
- బ్లడ్ టెస్ట్
ఫుడ్ పాయిజనింగ్ చికిత్స విధానం :
- ఫుడ్ పాయిజనింగ్ బ్యాక్టీరియా వలన వచ్చినట్లయితే వైద్యులు యాంటీబయటిక్స్ సూచిస్తారు.
- పారా సైట్స్ వల్ల వచ్చినట్లయితే ఆంటీ పారాసైటిక్ మెడిసిన్స్ సూచిస్తారు.
- అలాగే ప్రో బయోటిక్స్ తీసుకోమని వైద్యులు సలహా ఇస్తారు.
ఫుడ్ పాయిజన్ అయిన వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి :
- అన్నం
- రసం
- కిచిడి
- ఓట్స్
- వైట్ బ్రెడ్
- అరటిపండు పుచ్చకాయ వంటి పండ్లు తీసుకోవాలి
- ఫుడ్ పాయిజన్ అయినవారు అన్నం కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి.
- అలాగే నీళ్లు కొబ్బరి నీళ్లు ఓఆర్ఎస్ వంటివి ఎక్కువగా తాగాలి.
ఫుడ్ పాయిజన్ అయినవారు ఎటువంటి ఆహారం తినకూడదు :
- బ్రౌన్ రైస్
- పచ్చి కూరగాయలు పండ్లు
- నూనె ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు
- ఫ్రైడ్ ఫుడ్స్
- కాఫీ, పాలు , చాయ్ వంటివి తక్కువగా తీసుకోవాలి
- మసాలా ఉన్న ఆహార పదార్థాలు తగ్గించాలి
- సోడా శీతల పానీయాలు కూడా తగ్గించాలి.
మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :