పిత్తాశయం శరీరంలో పైన కుడి భాగంలో ఉంటుంది. కాలేయం ఉత్పత్తి చేసిన పైత్యరసం పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. జీర్ణక్రియకు అవసరమైనప్పుడు ఈ పైత్యరసం, పిత్తాశయం నుంచి చిన్న ప్రేగులోకి విడుదల అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ పైత్యరసంలో రాళ్ళు ఏర్పడతాయి. ఈ పైత్యరసంలో రాళ్లు అనేవి మిల్లీమీటర్ నుంచి సెంటీ మీటర్స్ వరకి పరిమాణంలో ఉంటాయి.
పిత్తాశయంలో రాళ్లు ఎవరిలో ఎక్కువగా వస్తాయి :
- ఆడవారిలో
- ప్రెగ్నెన్సీ
- అధిక బరువు ఉన్న వారిలో
- 40 ఏళ్ళు పైబడిన వారిలో
- డయాబెటిస్
పిత్తాశయంలో రాళ్ళు రావడానికి కారణాలు :
- పైత్యరసంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉండటం
- కాలేయ సంబంధిత వ్యాధి, లివర్ సిర్రోసిస్, జాండీస్ ఇలాంటి సందర్భాల్లో బిలిరుబిన్ ఎక్కువ అవుతుంది. ఈ బిల్రూబిన్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడతాయి.
- త్వరగా బరువు తగ్గాలనుకునే వారిలో కూడా పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడతాయి.
పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారికి కనబడే లక్షణాలు :
- శరీరంలో పైన కుడి భాగంలో ఏక్కడైతే పిత్తాశయం ఉంటుందో అక్కడ తీవ్రమైన నొప్పి ఉంటుంది.
- ఈ నొప్పి కొన్ని సందర్భాల్లో కుడి భుజానికి అలాగే నడుముకి వ్యాపిస్తుంది.
- తీవ్రమైన జ్వరం తో పాటు ఎక్కువగా వనకడం.
- తేన్పులు, అజీర్తి, గ్యాస్, వాంతులు, విరోచనాలు ఉండడం.
- తీవ్రమైన సందర్భాల్లో లో జాండీస్ లక్షణాలు ( శరీరం పచ్చగా అయిపోవడం అలాగే కళ్ళు కూడా పచ్చగా అయిపోవడం).
పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారికి ఏటువంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారు :
- అల్ట్రా సౌండ్ స్కాన్
- ఎంఆర్ఐ స్కాన్
పిత్తాశయంలో రాళ్ళు చికిత్స :
పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారికి ఎటువంటి లక్షణాలు లేనట్లయితే చికిత్స ఏమీ అవసరం ఉండదు.
పిత్తాశయంలో రాళ్ల వలన ఎవరికైతే తీవ్రమైన నొప్పి ఉంటుందో వారికి లాప్రోస్కోపీ ద్వారా పిత్తాశయం నిర్మూలించ వలసి వస్తుంది.
పిత్తాశయంలో రాళ్లు – నివారణ చర్యలు :
- సరైన సమయానికి ఆహారం తీసుకోవడం.
- బరువు త్వరగా కాకుండా నెమ్మదిగా తగ్గడం.
- ఎక్కువగా పీచు ఉన్న ఆహారం తీసుకోవాలి.
మరింత సమాచారానికి క్రింది లింక్ క్లిక్ చేయండి :