పాస్ టాబ్లెట్( నెలసరి లో వచ్చే అధిక రక్త స్రావం తగ్గించే టాబ్లెట్ )

పాస్ టాబ్లెట్ లో tranexamic acid 500 mg ఉంటుంది. త్రానేక్సమిక్ ఆసిడ్ అనేది ఒక యాంటీ ఫైబ్రినోలైటిక్ మెడిసిన్, అధిక రక్త స్రావాన్ని తగ్గించే టాబ్లెట్.

పాస్ టాబ్లెట్ ఉపయోగాలు :

  • నెలసరి లో వచ్చే అధిక రక్త స్రావం
  • నెలల తరబడి వచ్చే పీరియడ్స్
  • ముక్కులో నుంచి వచ్చే రక్త స్రావం
  • సర్జరీ అయిన తరువాత ( ప్రొస్టేట్ గ్రంథి సర్జరీ, బ్లాడర్ సర్జరీ )
  • కళ్ళ నుంచి వచ్చే రక్తం
  • పన్ను తీసిన తర్వాత
  • హీమోఫిలియ

పాస్ ఎన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది :

పాస్ టాబ్లెట్ లో, లిక్విడ్, ఇంజెక్షన్లు రూపంలో బయట అందుబాటులో ఉంటుంది.

పాస్ టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి :

పాస్ టాబ్లెట్ ఆ వ్యక్తి కి ఉన్న తీవ్రత ప్రకారం ఉపయోగించాలి. ఎవరికైతే అధిక రక్త స్రావం నెలల తరబడి వుంటుందో అలాంటి వారు ప్రతి రోజు మూడు పూటలు తిన్న తర్వాత టాబ్లెట్ తీసుకోవాలి.

పాస్ టాబ్లెట్ దుష్ప్రభావాలు :

  • గాబరవడం
  • విరోచనాలు
  • దురద పెట్టడం
  • తల నొప్పి
  • ఛాతీ నొప్పి లాంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది.

పాస్ టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు :

  • ట్రానెక్సమిక్ ఆసిడ్ అలర్జీ
  • కిడ్నీ ఇబ్బంది
  • త్రాంబోసిస్
  • DIC
  • ప్రెగ్నెన్సీ
  • పాలు ఇచ్చే తల్లులు

పాస్ టాబ్లెట్ ఎంత మోతాదులో ఉంటుంది :

పాస్ టాబ్లెట్ 250 మి.గ్రా ; 500 మి.గ్రా ; 1000 మి.గ్రా మోతాదులో అందుబాటులో ఉంటుంది.

Pause MF టాబ్లెట్ లో ట్రానెక్సామిక్ ఆసిడ్ అలాగే మెఫీనమిక్ ఆసిడ్ ఉంటుంది. ఎవరికైతే అధిక రక్త స్రావం అలాగే నొప్పి ఉంటుందో అలాంటి వారు Pause MF టాబ్లెట్ ఉపయోగించాలి.

Pause Tablet ( నెలసరి లో వచ్చే అధిక రక్త స్రావాన్ని తగ్గించే టాబ్లెట్)

Leave a Comment

Exit mobile version