టిఫ్ఫా స్కాన్ అంటే “టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనమలీస్ “.
టిఫ్ఫా స్కాన్ నీ ” లెవెల్ 2 స్కాన్ ” లేదా ” అనమలీ” స్కాన్ అని కూడా పిలుస్తారు.
ఈ టీఫ్ఫా స్కాన్ 18-23 వారాల ప్రెగ్నెన్సీ/ రెండవ ట్రై మిస్టర్ /5 వ నెలలో చేస్తుంటారు.
ఈ టిఫ్ఫా స్కాన్ వలన పుట్టబోయే బిడ్డకు అవయవాలు సక్రమంగా ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు.
ఈ టిఫ్ఫా స్కాన్ వలన పుట్టబోయే బిడ్డకు గుండె సంబంధిత ఇబ్బంది, వెన్ను ముక్క, మెదడు ఇబ్బంది ఏమైనా ఉందా అని కూడా తెలుసుకోవచ్చు.
పుట్టబోయే బిడ్డకు కాళ్ళు, చేతులు ఎలా ఉన్నాయి, గ్రహణ మొర్రి ఏమైనా ఉందా, చెవి, ముక్కు ఎలా ఉన్నాయి కూడా తెలుసుకోవచ్చు.
ఈ టి.ఫ్ఫా స్కాన్ ద్వారా ప్లేసెంటా ఎలా ఉంది, ఉమ్మ నీరు ఎంత ఉంది అలాగే జన్యు పరమైన ఇబ్బంది ఏమైనా ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు.
టి.ఫ్యా స్కాన్ ఎవరు చేయించుకోవాలి :
- ప్రెగ్నెన్సీలో
- 30 ఏళ్లు దాటిన గర్భవతులు
- మేనరికం లో పెళ్లి చేసుకున్న వారు
- మొదటి ప్రెగ్నెన్సీ లో ఇబ్బంది వచ్చిన వారు ఈ టి.ఫ్ఫ్యా స్కాన్ చేయించుకోవాలి.
టిఫ్ఫా స్కాన్ ఎలా చేస్తారు ?
- టిఫ్ఫా స్కాన్ అల్ట్రా సౌండ్ స్కాన్ లానే చేస్తారు.
- టిఫ్ఫా స్కాన్ చేయించే సమయంలో కొంచం వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి.
- టిఫ్ఫా స్కాన్ చేయించుకునే సమయంలో మూత్రాశయం నిండుగా ఉండాలి.అంటే ఎక్కువగా నీళ్ళు త్రాగాలి.
- టిఫ్ఫా స్కాన్ ఎక్కడైతే చేస్తారో అక్కడ ఒక జెల్ పెడతారు. ఈ జెల్ పెట్టిన తర్వాత ఒక ట్రాన్స్ద్యూసెర్ సహాయంతో పొట్ట భాగంలో కొద్దిగా జరుపుతారు.
- ఆ తరువాత ఇమేజ్ అనేది కంప్యూటర్ లో ఏర్పడుతుంది.
టి ఫా స్కాన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది:
టిఫ్ఫా స్కాన్ చేయడానికి సుమారు 20 నుండి 30 నిమిషాలు సమయం పడుతుంది.
టిఫ్ఫా స్కాన్ కి ఖర్చు ఎంత అవుతుంది :
టిఫ్ఫా స్కాన్ చేయించడానికి సుమారు 2000 – 3000/- రూపాయాలు ఖర్చు అవుతుంది.
మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :