T bact ఆయింట్మెంట్లో మ్యుపిరోసిన్ ఉంటుంది. ఈ మ్యుపిరోసిన్ అనేది ఒక యాంటీబయాటిక్ బ్యాక్టీరియాని నిర్మూలించడానికి ఇది సహాయపడుతుంది.
మ్యుపిరోసిన్ 5 గ్రా ఆయింట్మెంట్ ధర సుమారు 100 నుంచి 120 రూపాయల వరకు ఉంటుంది.
T- Bact ( మ్యుపిరోసిన్ ) ఆయింట్మెంట్ ఉపయోగాలు :
- ఇంపేటిగో – చిన్నచిన్న ఎర్రటి కురుపులు నోటి చుట్టూ అలాగే ముక్కు పైన వస్తాయి ఇవి ఎక్కువగా చిన్నపిల్లలు చూస్తాము.
- ఫాలికలైటీస్ – చిన్న చిన్న పింపుల్స్ మొహం పైన చాతి పైన కాళ్ళ పైన ఉంటాయి.
- ఫ్యూరంకలోసెస్ సెగ గడ్డలు
- గాయం పైన
- కుట్లపైన
- చిన్నపాటి ఏదైనా దెబ్బ తగిలినా కూడా ఈ ఆయింట్మెంట్ అనేది ఉపయోగించవచ్చు.
T bact ointment ఎలా ఉపయోగించాలి :
- ఈ ఆయింట్మెంట్ పెట్టుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
- ఆ తరువాత కొద్దిగా ఆయింట్మెంట్ తీసుకొని ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రదేశంలో ఈ ఆయింట్మెంట్ అనేది పెట్టుకోవాలి
- ప్రతిరోజు మూడు పూటలు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది
- తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఆ ప్రదేశాన్ని బ్యం లేదా గాస్ సహాయంతో కవర్ చేసుకోవాలి.
***ఈ ఆయింట్మెంట్ పది రోజుల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు. చాలా రోజులు ఉపయోగించినట్లయితే బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
T- Bact మ్యుపిరోసిన్ ఆయింట్మెంట్ పెద్ద పెద్ద గాయాల పైన ,రక్తం వచ్చే ప్రదేశంలో ,నోటిలో, ముక్కులో, కళ్ళలో పెట్టుకోరాదు.
T- Bact మ్యుపిరోసిన్ ఆయింట్మెంట్ దుష్ప్రభావాలు :
- మంట ఉండడం
- దురద పెట్టడం వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది.
మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి :