Sporlac DS టాబ్లెట్లు లో లాక్టో బాసీల్లస్ అనే ప్రోబాయాటిక్ ఉంటుంది.
విరోచనాలు ఉన్నవారు ఈ Sporlac DS టాబ్లెట్ తీసుకున్నప్పుడు వీటిలో ఉన్న లాక్టో బాసిల్లస్ లాక్టిక్ ఆసిడ్ గా మారుతూ ఉంటుంది.
ఈ లాక్టిక్ ఆసిడ్ ప్రేగు లో ఉన్న pH తగ్గిస్తుంది. ఇలా pH తగ్గడం వలన చెడు బ్యాక్టీరియా వృద్ది చెందకుండా ఉంటుంది. అలాగే ప్రేగు ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
SPORLAC DS టాబ్లెట్ ఉపయోగాలు :
- విరోచనాలు ఉన్నవారు
- యాంటీబయోటిక్స్ ఉపయోగించినప్పుడు వచ్చే లూస్ మోషన్స్
- చిన్నపిల్లల్లో వచ్చే విరోచనాలు
- జీర్ణం త్వరగా అవ్వడానికి
- పిత్తులను తగ్గించడానికి
- ప్రేగులో అల్సర్స్ ఉన్నవారికి
- కీమోథెరపీ చేయించుకునే వారికి
- ప్రేగు ఇన్ఫెక్షన్ ఉన్నవారు
Sporlac DS టాబ్లెట్, పౌడర్, అలాగే సిరప్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
SPORLAC DS పౌడర్ ఎలా ఉపయోగించాలి ?
1 గ్రాం పౌడర్ 10 – 15 ml గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవాలి. ఎక్కువగా ఈ పౌడర్ చిన్న పిల్లలలో వచ్చే విరోచనాలలో ఉపయోగిస్తారు.
SPORLAC DS టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి :
ఈ టాబ్లెట్ డోసేజ్ అనేది విరోచనాల యొక్క తీవ్రతబట్టి అలాగే వయసు ప్రకారం తీసుకోవాలి.
సాధారణంగా రెండు నుంచి మూడు టాబ్లెట్లు ప్రతిరోజు తిన్న తర్వాత తీసుకోవాలి.
విరోచనాలు సమస్య తగ్గేవరకి ఈ టాబ్లెట్ తీసుకోవచ్చు.
ఎవరైతే యాంటీబయోటిక్స్ తో పాటు ఈ టాబ్లెట్ తీసుకుంటున్నారో వారు మాత్రం యాన్టిబయాటిక్స్ వేసుకున్న రెండు గంటల తర్వాత ఈ టాబ్లెట్ తీసుకోవాలి.
Sporlac DS టాబ్లెట్ దుష్ప్రభావాలు :
- తేన్పులు
- కడుపు లో గ్యాస్ రావడం.
Sporlac DS టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు :
- Laacto bacilllus ఎలర్జీ ఉన్నవారు
- ప్రెగ్నెన్సీ
- ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు
- పాలు ఇచ్చే తల్లులు
- లివర్ ,గుండె, అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు
- తీవ్రమైన ప్రేగు ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఈ టాబ్లెట్ తీసుకోకూడదు.
మరింత సమాచారానికి క్రింది విడియో చూడండి :