Pumpkin seeds ( గుమ్మడి గింజలు తినడం వలన కలిగే ఉపయోగాలు )

Pumpkin seeds

గుమ్మడి గింజలు లో చాలా పోషక విలువలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ (పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్) ఉండడం వలన క్యాన్సర్ రాకుండా సహాయ పడుతూ ఉంటుంది. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ అలాగే మగవారిలో ప్రొస్టేట్ గ్రంథి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తినాలి.

*గుమ్మడి గింజలులో మెగ్నీషియం ఎక్కువ ఉండటం వలన అధిక రక్తపోటును అలాగే అధిక షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి ఇవి చాలా సహాయపడతాయి.

*గుమ్మడి గింజలు లో పోలి అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన గుండె ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది. అలాగే ఫైతోస్టీరోల్ ఉండడం వలన మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తక్కువ చేస్తాయి.

*గుమ్మడి గింజలు లో జింక్ ఎక్కువ ఉండటం వలన మగ వారిలో లో వీర్య కణాలు సమృద్ధి చేయడానికి సహాయ పడుతూ ఉంటుంది. అలాగే గర్భందాల్చిన స్త్రీలు కూడా గుమ్మడి గింజలు తినడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది.

*గుమ్మడి గింజల లో ఫైబర్స్ ఎక్కువ ఉండటం వలన బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ గుమ్మడి గింజలు తినవచ్చు.

గుమ్మడి గింజలు ఎలా తినాలి ?

గుమ్మడి గింజలు అనేవి పచ్చివి కాని వేయించినవి గాని తినవచ్చు అలాగే సలాడ్స్ లో సూప్స్ లో కూడా ఇవి ఉపయోగించవచ్చు.

ప్రతిరోజు గుమ్మడి గింజలు ఎన్ని తినాలి ?

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ప్రతిరోజు 30 గ్రాములు అంటే సుమారు 1/2 కప్పు వరకు గుమ్మడి గింజలు తీసుకోవచ్చు.

గుమ్మడి గింజలు ఏ సమయంలో తినాలి ?

గుమ్మడి గింజల నేవి ఏ సమయంలోనైనా తినవచ్చు.

గుమ్మడి గింజలు ఎక్కువగా తినడం వల్ల కలిగ దుష్ప్రభావాలు ?

ఇవి ఎక్కువగా తినడం వలన కడుపులో మంట కడుపు ఉబ్బరం మలబద్ధకం లాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము అలాగే మరీ ఎక్కువగా తిన్నట్లయితే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.

గుమ్మడి గింజలు

Leave a Comment