Primolut N టాబ్లెట్ లో నార్ ఎతిస్తీర్హోన్ 5 మి గ్రా ఉంటుంది.
సాధారణంగా ఆడవారిలో ప్రోజేస్తీరోన్ హార్మోన్ ఉంటంది.ఈ ప్రోజేస్తీరోన్ ఓవ్యులేషన్,ఆలాగే నెలసరి రావడానికి సహాయ పడుతుంది. నార్ ఎతిస్తీర్హోన్ కృత్రిమంగా తయారు చేసిన హార్మోన్.
Primolut N టాబ్లెట్ ఉపయోగాలు :
- నెలసరి సమయంలో వచ్చే అధిక రక్తస్రావం తగ్గిస్తుంది
- నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన ఇబ్బంది, నొప్పి నీ తగ్గిస్తుంది.
- నెలసరి సరైన సమయానికి రానివారికి
- ఎండోమెట్రియాసిస్ సమస్యతో బాధపడేవారికి
- నెలసరి ఆలస్యంగా రావడానికి కూడా ఈ టాబ్లెట్ ఉపయోగ పడుతుంది.
- PCOS
- ప్రీ మెన్స్ర్రూవాల్ సిండ్రోమ్
Primolut N టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి:
* ఈ టాబ్లెట్ ఎన్ని రోజులు అలాగే ఎలా ఉపయోగించాలి అనేది వారికి ఉన్న సమస్య ప్రకారం ఉంటుంది.
* నెలసరి ఆలస్యంగా రావడానికి ఈ టాబ్లెట్ నెలసరి తేది కన్న మూడు రోజుల ముందు ఉపయోగించాలి. ప్రతి రోజు ఒకటి లేదా రెండు టాబ్లెట్స్ ఉపయోగించాలి. ఈ టాబ్లెట్ ప్రతీ రోజు అదే సమయంలో తీసుకోవాలి.
* అధిక రక్త స్రావం సమస్యతో బాధపడే వారు నెలసరి ఆయిపోయిన 5 నుంచి 25 రోజుల వారికి ప్రతి రోజు రెండు సార్లు ఈ టాబ్లెట్ తీసుకోవాలి.
* ప్రీ మెన్స్ర్రూవాల్ సిండ్రోమ్ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఒకటి టాబ్లెట్ తీసుకొవాలి.
* ఎండోమెట్రియాసిస్ సమస్యతో బాధపడేవారు 6-9 నెలలు ఈ టాబ్లెట్ తీసుకోవాలి.
Primolut N Tablet దుష్ప్రభావాలు :
ఈ టాబ్లెట్ కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ కానీ కొందరికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశo ఉంటుంది.
- గబారవడం
- కళ్ళు తిరగడం
- తల నొప్పి
Primolut N టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు :
- గర్భవతి ఉన్నవారు
- పాలు ఇచ్చే తల్లులు
- షుగర్ పేషంట్స్
- గుండె సమస్య ఉన్నవారు
- కాలేయ సంబంధిత ఇబ్బంది ఉన్నవారు ఈ టాబ్లెట్ తీసుకోకూడదు.