Pantop 40 ( పాన్ టాప్ 40 ) టాబ్లెట్ ఉపయోగాలు , దుష్ప్రభావాలు .

Pantop 40 tablet

Pantop 40 టాబ్లెట్ లో పంటాప్రాజోల్ ఉంటుంది. ఈ పంటాప్రాజోల్ టాబ్లెట్స్ , సిరప్ ,ఐ.వి సస్పెన్షన్ లో మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.

Pantop ( పాన్ టాప్ 40 ) టాబ్లెట్ ఎలా పని చేస్తుంది ?

పంటాప్రాజోల్ అనేది ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. సాధారణంగా మానవ శరీరంలోని కడుపులో ప్రోటాన్ పంప్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్ పంప్స్ ఆసిడ్ నీ ఉత్పత్తి చేస్తాయి.ఈ పంటాప్రాజోల్ తీసుకోవడం వలన ప్రోటాన్ పంప్స్ నుంచి ఉత్పత్తి అయ్యే ఆసిడ్ నీ నివారిస్తుంది. అందువలన ఎవరికైతే ఆసిడ్ ఇబ్బంది ఉంటుందో అలాంటి వారు ఈ పాన్ టాప్ టాబ్లెట్ తీసుకోవడం వలన ఈ అసిడిటీ తగ్గుతుంది.

Pantop 40 ( పాన్ టాప్ 40 ) టాబ్లెట్ ఎవరు తీసుకోవాలి :

  • ఆసిడ్ సమస్యలు
  • కడుపులో అల్సర్స్
  • GERD సమస్య
  • హెచ్ . పైలోరీ ఇన్ఫెక్షన్
  • జాల్లింగర్ ఎల్లిసన్ సిండ్రోమ్
  • చాలా కాలం నుంచి NSAIDS నొప్పి మాత్రలు ఉపయోగించేవారు ఈ పాన్ టాప్ 40 టాబ్లెట్ ఉపయోగించమని వైద్యులు సూచిస్తారు.

Pantop 40 ( పాన్ టాప్ 40 ) టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి ?

ఈ పాన్ టాప్ 40 టాబ్లెట్ ప్రతి రోజు ఉదయం తినక ముందు ఒక టాబ్లెట్ తీసుకోవాలి.

Pantop 40 ( పాన్ టాప్ 40 ) టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు ?

  • గర్భవతి తల్లులు
  • పాలు ఇచ్చే తల్లులు
  • కాలేయ ఇబ్బంది ఉన్నవారు
  • ఎముకలకు సంభందించిన ఇబ్బంది ఉన్నవారు ఒకసారి డాక్టర్ నీ సంప్రదించి ఈ టాబ్లెట్ తీసుకోవాలి.

Pantop 40 ( పాన్ టాప్ 40 ) టాబ్లెట్ దుష్ప్రభావాలు :

  • గాబరవ్వడం
  • కళ్ళు తిరగడం
  • వాంతులు
  • తల నొప్పి
  • ఈ పాన్ టాప్ 40 టాబ్లెట్ దీర్ఘ కాలంగా ( 1 సంవత్సరం ) కన్నా ఎక్కువగా ఉపయోగించిన వారిలో కాల్షియం , మెగ్నీషియం తక్కువగా అయ్యి ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది.
పాన్ టాప్ 40 టాబ్లెట్ ఉపయోగాలు

Leave a Comment