Minoxidil (మినాక్సిడిల్) ఎలా ఉపయోగించాలి,ఎవరు ఉపోయోగించాలి, ఎవరు ఉపయోగించకూడదు ?

Minoxidil

మినాక్సిడిల్ అనేది ఒక వ్యాసో డైలేటర్ ( రక్త నాళాలను విశాలము చేయు ) మెడిసిన్. మొదటి సారి ఈ మినాక్సిడిల్ రక్త పోటునీ తగ్గించడానికి ఉపోయోగించేవారు. కానీ ఇలా ఉపయోగించడం వలన జుట్టు ఎక్కువగా రావడం అనే దుష్ప్రభావం చూపించండి. అందువలన అప్పటి నుంచి ఈ మినాక్సిడిల్ అనేది జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తున్నారు.

మినాక్సిడిల్

ఈ మినాక్సిడిల్ 2 % అలాగే 5 % లో అందుబాటులో ఉంటుంది.

2 % మినాక్సిడిల్ ఎక్కువగా ఆడవారిలో అలాగే మగ వారిలో ఉపయోగిస్తున్నారు.

5 % మినాక్సిడిల్ ఎక్కువగా మగ వారిలో ఉపయోగిస్తున్నారు.

మినాక్సిడిల్ ఎలా పని చేస్తుంది ?

మినాక్సిడిల్ అనేది ఒక వ్యాసో డైలేటర్ ( రక్త నాళాలను విశాలము చేయు ) మెడిసిన్. ఎక్కడైతే ఈ మినాక్సిడిల్ పెడతారో అక్కడ ఉన్న రక్త నాలలు డైలేట్ అవుతాయి. ఇలా అవ్వడం వలన అక్కడ రక్త ప్రసరణ పెరిగి అక్కడ ఎక్కువగా ఆక్సిజన్, పోషక పదార్థాలు వచ్చి జుట్టు ఊడకుండా చూస్తుంది.

Hair loss

మినాక్సిడిల్ ఎవరు ఉపయోగించాలి ?

  • బట్టతల ఉన్నవారు
  • కీమో థెరపీ చేయించుకోవడం వలన కలిగే జుట్టు ఊడడం వలన
  • గడ్డం పెంచడానికి
  • జుట్టు పల్చగా ఉన్న వారు ఈ మినాక్సిడిల్ఉపయోగించాలి.

మినాక్సిడిల్ ఎవరు ఉపయోగించకూడదు ?

  • 18 ఏళ్ల లోపు పిల్లలు
  • గర్భవతులు
  • పాలు ఇచ్చే తల్లులు
  • కాలేయ, గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నవారు
  • సోరియాసిస్

మినాక్సిడిల్ దుష్ప్రభావాలు :

  • తల నొప్పి
  • జుట్టు ఎండి పోవడం
  • జుట్టు దురద
  • జుట్టు ఇన్ఫెక్షన్

మినాక్సిడిల్ ఎలా అందుబాటులో ఉంటుంది :

మినాక్సిడిల్ సొల్యూషన్, స్ప్రే, జెల్, ఫోం రూపం లో అందుబాటులో ఉంటుంది.

మినాక్సిడిల్ ఎలా ఉపయోగించాలి ?

మినాక్సిడిల్ ఉపయోగించే ముందు జుట్టు డ్రై గా ఉండాలి.

  • మినాక్సిడిల్ సొల్యూషన్ ఉపయోగించేవారు 1 మి. లి ఉపయోగించాలి.
  • మినాక్సిడిల్ స్ప్రే ఉపయోగించే వారు 6 స్ప్రేస్ ఉపయోగించాలి.
  • మినాక్సిడిల్ ఫోం ఉపయోగించేవారు ½ కప్ ఉపయోగించాలి.

ప్రతి రోజు మినాక్సిడిల్ రెండు సార్లు ఉపయోగించాలి. 1 మి. లి కన్నా ఎక్కువగా ఉపయోగించకూడదు.

మినాక్సిడిల్ పెట్టిన తర్వాత చేతి ముని వేళ్ళతో మర్ధన చేయాలి.ఆ తర్వాత చేతులు శుబ్రంగా కడగాలి.

మినాక్సిడిల్ బట్టలకి అంటుకునే అవకాశం ఉంటుంది. అందువలన మినాక్సిడిల్ పెట్టుకున్న తర్వాత కనీసం రెండు గంటలు డ్రై అవ్వాలి.

మినాక్సిడిల్ పెట్టుకున్న తర్వాత 4 గంటల వరికి షాంపూ, హెయిర్ డ్రై అలాంటివి చేయకూడదు.

  • మినాక్సిడిల్ పెట్టుకున్న తర్వాత రిజల్ట్స్ రావడానికి కనీసం 4 నెలలు సమయం పడుతుంది.
  • మినాక్సిడిల్ జీవితాంతం ఉపయోగించాలి. ఈ మినాక్సిడిల్ మానేసిన 2-3 నెలలకి జుట్టు ఊడుతుంది.
మీనాక్సిడిల్ ఎలా ఉపయోగించాలి ?

      Leave a Comment