Mega Heal మెగా హీల్ ఆయింట్మెంట్ ఉపయోగాలు దుష్ప్రభావాలు

మెగా హీల్ ఆయింట్మెంట్లో కోల్లాఐడల్ సిల్వర్ అలాగే ఎమ్మార్పీఎస్ హైడ్రోజెల్ ఉంటుంది .

సిల్వర్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియాని నిర్మూలించడంలో సహాయపడుతుంది. హైడ్రోజల్ అనేది తేమను ఉంచడానికి సహాయపడుతూ ఉంటుంది. దీనివల్ల పుండు అనేది త్వరగా మానుతుంది.

Mega Heal Ointment ( మెగా హీల్ జెల్)

ఈ అయింట్మెంట్ యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ సెప్టిక్ మెడిసిన్.

ఈ జెల్ 15 గ్రా, 50 గ్రా,  100 గ్రా, 200 గ్రాములు లో అందుబాటులో ఉంటుంది.ఈ జెల్ ధర సుమారు 100-120/-  రూపాయల వరకు ఉంటుంది.

మెగా హీాల్  జెల్ ఉపయోగాలు :

  • ఈ జెల్ అనేది గాయాల పైన,
  • పుండ్లు,
  • ఏదైనా చర్మం గీరుక పోయిన,
  • డయాబెటిక్ అల్సర్,
  • ప్రెషర్ సోర్స్,
  • వారికోజ్ అల్సర్స్ వంటి గాయాల పైన పెట్టుకోవడం వలన పుండు త్వరగా మానుతుంది.

మెగా హీల్ అయిట్మెంట్ ఎలా ఉపయోగించాలి :

  • మొదటగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
  • ఆ తర్వాత పుండు లేదా గాయన్ని శుభ్రపరచాలి.ఎప్పుడైనా గాయాన్ని గాజ్ పీస్ తో   శుభ్రపరచాలి. దూది పెట్టకూడదు.
  • కొద్దిగా జెల్ తీసుకొని ఆ గాయం పైన పెట్టాలి.
  • ఒకవేళ గాయం పెద్దదిగా ఉన్నట్లయితే  బండాయిడ్ లేదా డ్రెస్సింగ్ చేయాలి.

మెగా హీల్ జెల్ దుష్ప్రభావాలు :

  • అలర్జీ
  • ఎర్రగా అవడం
  • మంట ఉండడం

మెగా హీల్ జెల్ ఎవరు ఉపయోగించకూడదు :

  • చిన్న పిల్లలు
  • గర్భవతులు
  • పాలు ఇచ్చే తల్లులు
  • రక్తం వచ్చే గాయాలు
  • అలాగే చాలా రోజులు కూడా ఈ జెల్ పెట్టుకో కూడదు.

మరింత సమాచారం కొరకు క్రింది వీడియో చూడండి :

Leave a Comment