Jaundice Symptoms and Treatment in Telugu|పచ్చ కామెర్లు లక్షణాలు, చికిత్స విధానం .

పచ్చ కామెర్లు ను “జాండిస్” అని కూడా పిలుస్తారు. రక్తంలో “బిలిరుబిన్” అనే పిగ్మేoట్ ఎక్కువ అవ్వడం వలన జాండిస్ వస్తుంది.

కామెర్లు ఎలా వస్తాయి :

సాధారణంగా ఎర్ర రక్త కణాలు 120 రోజులు బ్రతికి ఉంటాయి. ఆ తర్వాత చని పోతాయి. ఇలా అయిన తర్వాత ఎర్ర రక్తకణాలు లో ఉండే హీమోగ్లోబిన్ , హీమ్, అలాగె గ్లోబిన్ గా విడిపోయి హీమ్ అనేది బిలిరుబిన్ గా మారుతుంది.

ఈ బిలిరుబిన్ కాలేయం లోకి వెళుతుంది, కాలేయం నుంచి పిత్తాశయం, పిత్తాశయం నుండి క్లోమ గ్రంది ఆ తరువాత పేగు లోకి వెళ్లి అక్కడి నుంచి మలము లేదా మూత్రం ద్వారా శరీరం నుండి బయటకి వెళ్లి పోతుంది .

కానీ కొన్ని సందర్భాల్లో ఈ బిలిరుబిన్ శరీరంలో పేరుకు పోయి జాండిస్ వస్తుంది.

కామెర్లు|జాండిస్ రావడానికి కారణాలు :

  • రక్తం లో ఇన్ఫెక్షన్ ( హీమొలిటిక్ అనీమియా , ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ )
  • కాలేయ సంబంధిత ఇబ్బంది ( హెపటైటిస్ వైరస్ , బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, అధికంగా మధ్య పానం ,ఎక్కువగా మందులు వాడటం)
  • పిత్తాశయంలో రాళ్లు
  • క్లోమం గ్రంధి వాపు
  • పేగు లో ఇబ్బంది లేదా క్యాన్సర్
  • కొన్ని జన్యు పరమైన ఇబ్బంది ( Gilbert Syndrome, Dublin Johnson Syndrome )

జాండిస్ ఎక్కువగా అప్పుడే పుట్టిన పిల్లలు లో వస్తుంది . ఈ సందర్భాన్ని “నీయో నేటల్ జాండిస్ ” అంటారు.

జాండిస్ లక్షణాలు :

  • చర్మం పసుపు పచ్చగా మారడం
  • కళ్ళు పసుపచ్చగా ఉండడం
  • మూత్రం పసుపచ్చగా రావడం
  • దురద పెట్టడం
  • పొట్ట వాపు
  • ఆకలి వేయకపోవడం
  • బరువు తగ్గడం
  • జ్వరం లాంటి లక్షణాలు చూస్తాము

జాండీస్ నిర్ధారణ పరీక్షలు :

  • క్లినికల్ గా చూడడం
  • కొన్ని రక్త పరీక్షలు
  • లివర్ ఫంక్షన్ టెస్ట్ ( LFT )
  • బిలు రుభిన్ (Serum bilirubin )
  • CBP ( ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్)
  • మూత్ర పరీక్ష
  • అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ ( USG Abdomen Scan )
  • హెపటైటిస్ పరీక్ష
  • సిటీ ,ఎంఆర్ఐ స్కాన్

జాండీస్ చికిత్స విధానం :

జాండీస్ యొక్క చికిత్స విధానం అనేది జాండీస్ రావడానికి గల కారణాలు ప్రకారం చికిత్స ఉంటుంది.

లివర్కు సంబంధిత ఇబ్బంది ఉన్నప్పుడు లివర్ కాలయం చికిత్స ; హెపటైటిస్ వలన జాండీస్ వచ్చినప్పుడు హెపటైటిస్ చికిత్స లేదా పిత్తాశయంలో రాళ్లు ఉంటే పిత్తాశయం నిర్మూలన లాంటి చికిత్స చేయడం జరుగుతుంది.

జాండీస్ ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి :

  • రెస్ట్ తీసుకోవడం
  • ఎక్కువగా నీళ్లు తాగడం
  • ఆల్కహాల్ తగ్గించుకోవడం
  • ఎక్కువగా టాబ్లెట్స్ : లివర్ కి ఇబ్బంది కలిగించే టాబ్లెట్స్ వాడకపోవడం

మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి :

జాండిస్ /కామెర్లు రావడానికి కారణాలు,లక్షణాలు, చికిత్స విధానం

Leave a Comment