రక్త పోటు అంటే ఏమిటి ?
హై బి.పి నీ మెడికల్ టెర్మినాలజీ లో ” హైపర్ టెన్షన్” అని పిలుస్తారు. ఎప్పుడైతే బి.పి 120/80 mm Hg కన్నా అధికంగా ఉంటుందో అలాంటి సందర్భాల్లో రక్త పోటు అని పరిగణిస్తారు.
రక్త పోటు ( హై బి.పి ) రావడానికి కారణాలు :
- జన్యు పరమైన ఇబ్బంది
- ఒత్తిడి . ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి ఏపీనెఫ్రిన్ అనే హార్మోన్ విడుదల అవుతూ ఉంటుంది. ఈ ఎపినాఫ్రిన్ రక్తనాళాలను వెడల్పు తగ్గిస్తూ ఉంటుంది, దీని వలన రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
- సోడియం ఎక్కువగా ఉన్న పచ్చళ్ళు, ఉప్పు లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకున్న కూడా రక్తపోటు వస్తుంది . సోడియం వలన రక్తనాళాలు వెడల్పు తగ్గడం , అలాగే రక్తం యొక్క వాల్యూం ఎక్కువ అవుతుంది. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అధికంగా అవుతాయి.
- పొటాషియం లెవెల్స్ తక్కువగా ఉన్నవారికి కూడా బీపీ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే పొటాషియం అనేది రక్తనాళాల వెడల్పు పెంచుతుంది , ఎవరికైతే పొటాషియం లెవెల్స్ తగ్గుతాయో, అలాంటి వారికి రక్తనాళాల వెడల్పు తక్కువయి రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
- బరువు ఎక్కువగా ఉన్నవారికి గుండెపైన ఒత్తిడి పెరిగి రక్తపోటు వస్తుంది.
- ఎక్కువగా మద్యపానం , ధూమపానం చేసే వారికి కూడా బి. పీ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. మద్యపానంలో షుగర్, క్యాలరీస్ ఎక్కువగా ఉండటం వల్ల అలాగే సిగరెట్లు లో నీకోటిన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు వెడల్పు తక్కువ అయి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరుగుతాయి.
- అప్స్త్రక్టివ్ స్లీప్ ఆప్నీయ, గుండె సంబంధిత ఇబ్బంది ,కిడ్నీ ఇబ్బంది ,కాలేయ సంబంధిత ఇబ్బంది అలాగే సికిల్ సెల్ అనేమియా, సిస్టమిక్ లూపస్ అర్థమవుటోసిస్ లాంటి ఇబ్బందులు ఉన్నవారికి కూడా రక్తపోటు వస్తుంది
- వయసు పైబడిన వారికి రక్తనాళాలు ధృఢాత్వం పెరుగుతుంది. అందువలన ఈ వయసు పైబడిన వారిలో కూడా బీపీ లెవెల్స్ అధికంగా ఉంటాయి.
రక్త పోటు లక్షణాలు :
రక్తపోటుని “సైలెంట్ కిల్లర్” అని కూడా పిలుస్తారు, ఎందుకంటే రక్తపోటు ఉన్నవారికి ఎక్కువగా ఎటువంటి లక్షణాలు కనబడవు కానీ ఎవరికైతే బీపీ లెవెల్స్ అధికంగా పెరుగుతాయో అలాంటి వారిలో మాత్రమే లక్షణాలు కనబడతాయి.
- తలనొప్పి
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- ముక్కులో నుంచి రక్తం కారడం
- కళ్ళు తిరగడం
- చాతి నొప్పి
- మూత్రంలో రక్తం రావడం
రక్తపోటు రాకుండా ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి :
- సోడియం ఎక్కువగా ఉన్న ఉప్పు, పచ్చళ్ళు, బయట ఆహారం తక్కువగా తీసుకోవాలి.
- పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి
- ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
- బరువు అనేది తగ్గించుకోవడం
- రెగ్యులర్గా వ్యాయామం చేయడం
- ఒత్తిడి ఉన్నవారికి మెడిటేషన్ చేయడం ఇలాంటి పాటించడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ రాకుండా నివారించవచ్చు .
రక్త పోటు చికిత్స విధానం :
అధికంగా రక్త పోటు ఉన్నవారికి డాక్టర్ల సలహా మేరకు బీపీ తగ్గించే మందులు ఉపయోగించాలి.
మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :