CRP అంటే సి రియాక్టివ్ ప్రోటీన్.
ఎవరికైనా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి అనేది ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి కొన్ని ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ అనేవి విడుదల చేస్తాయి. ఆ మీడియేటర్ లో ఒక ఒక రకం CRP. ఈ CRP ఎక్కువగా కాలేయ భాగం నుంచి విడుదల అవుతోంది.
CRP ఉపయోగాలు:
CRP వలన ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ తక్కువ అవుతాయి.
* నార్మల్ CRP లెవెల్స్ అనేవి 0.8 mg/L నుంచి 3 mg/L వరకు ఉంటాయి.
ఎవరిలో CRP లెవెల్స్ ఎక్కువ ఉంటాయి :
సాధారణంగా ఆడవారిలో అలాగే గర్భిణీ స్త్రీలలో CRP లెవెల్స్ అనేవి సహజంగానే ఎక్కువ ఉంటాయి.
* బ్యాక్టీరియల్ అలాగే వైరల్ ఇన్ఫెక్షన్లు లో CRP లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి.
*కండరాల నొప్పి (రుమటాయిడ్ ఆర్థరైటిస్) అలాగే సిస్టమిక్ లూపస్ తో బాధపడే వారిలో, ట్యూబర్క్యులోసిస్ (టీబీ) , గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో కూడా ఈ లెవెల్స్ ఎక్కువ అవుతాయి.
*అవయవ మార్పిడి చేసుకున్నవారిలో కూడా ఈ లెవెల్స్ ఎక్కువ అవుతాయి.
CRP ఎక్కువ ఉన్న వారిలో ఎటువంటి లక్షణాలు కనబడతాయి
ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నవారిలో జ్వరం రావడం, అలాగే శ్వాసకోశ ఇబ్బంది ఉన్నవారిలో దగ్గు దమ్ము ఆయాసం ఉండడం, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో మోకాలు నొప్పి మోకాలు వాపు లాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము.
CRP రక్త పరీక్ష ఎలా చేస్తారు ?
ఇది ఒక రక్త పరీక్ష మీరు ఏ సమయంలో నైనా వెళ్లి మీ యొక్క రక్త నమూనాలు అందించవచ్చు. అలాగే వీటి ఫలితాలు కూడా వెంటనే అందుబాటులోకి వస్తాయి . ఈ పరీక్షకు సుమారు 200/- వరకు ఖర్చు అవుతుంది.
మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :