Chia Seeds ( చియా సీడ్స్ ఉపయోగాలు , దుష్ప్రభావాలు)

Chia seeds

చియా సీడ్స్ అనేవి తెలుపు బూడిద రంగులో ఉండే విత్తనాలు. ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి.

చీయ సీడ్స్ ఉపయోగాలు :



* చియా సీడ్స్ లో యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వలన క్యాన్సర్ నియంత్రణ లో ఇవి చాలా సహాయ పడతాయి.

చీయా విత్తనాలలో ఫైబర్స్ అలాగే ప్రోటీన్స్ అధికంగా ఉండటం వలన బరువు తగ్గడానికి చాలా ఉపయోగ పడుతూ ఉంటుంది అలాగే మలబద్ధకం సమస్యని తగ్గించడానికి కూడా ఈ సీడ్స్ చాలా ఉపయోగపడుతుంది .



చియా విత్తనాల లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి ఇవి చాలా సహాయపడుతూ ఉంటుంది అలాగే రోగనిరోధకశక్తిని పెంచడానికి రక్తపోటును నియంత్రించడానికి షుగర్ లెవల్స్ తగ్గించడానికి ఈ విత్తనాలు చాలా సహాయపడుతాయి.

అలాగే ఈ విత్తనాల లో క్యాల్షియం, ఫాస్ఫరస్ అలాగే మెగ్నీషియం ఉండడం వలన ఎముకల దృఢత్వానికి , పళ్ళ దృఢత్వానికి ఇవి చాలా సహాయపడుతూ ఉంటాయి. వీటిలో ట్రిప్టోఫాన్ ఉండడం వలన డిప్రెషన్ ను తగ్గించడానికి కూడా ఈ విత్తనాలు చాలా సహాయపడుతూ ఉంటాయి.

ఈ విత్తనాల లో బి కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉండటం వలన చర్మానికి అలాగే జుట్టు బలోపేతానికి ఇవి చాలా సహాయపడుతాయి.

చియా సీడ్స్ ఎలా తినాలి ?

ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల ఈ విత్తనాలు అనేవి రెండు నుంచి మూడు కప్పుల నీళ్ళల్లో సుమారు 20 నిమిషాల పాటు నాన బెట్టాలి ఆ తర్వాత ఈ విత్తనాలు అనేవి తీసుకోవాలి.

* ఈ విత్తనాల అనేవి పండ్ల రసం లో కానీ ఫ్రూట్స్ జ్యూస్, సలాడ్స్ లో వేసి తినవచ్చు అలాగే తేనెలో పాలల్లో కూడా కలుపుకొని తీసుకోవచ్చు.

* ఈ విత్తనాలు ఎప్పుడు డ్రై గా అంటే నానబెట్టకుండా ఎప్పుడు తినకూడదు. ఇలా డ్రైగా తింటే గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి .అలాగే రీసెంట్ గా వచ్చిన పబ్లికేషన్ ప్రకారం చియా సీడ్స్ అనేవి డ్రై గా తీసుకుని ఆ తరువాత నీళ్లు తాగినట్లయితే ఈ చియా సీడ్స్ అనేవి మనిషి శరీరంలోని జీర్ణవ్యవస్థలోకి వెళ్లి జీర్ణ వ్యవస్థనీ ఇబ్బంది చేసే అవకాశాలు ఉన్నాయి అందువలన ఈ చియ విత్తనాలు ఎప్పుడు డ్రై విధంగా తినకూడదు. నానబెట్టినవి మాత్రమే తీసుకోవాలి.

చీయా సీడ్స్ ఏ సమయంలో తినాలి :

ఈ విత్తనాలు అనేవి ఏ సమయంలోనైనా తినవచ్చు కానీ ఎవరైతే బరువు తగ్గాలి అనుకునే వారు మాత్రం ఉదయం తీసుకోవాలి.

చియా సీడ్స్ ఎంత మోతాదులో తినాలి :

ఈ విత్తనాలు ప్రతిరోజు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకోవాలి అంతకంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకున్నట్లయితే అజీర్తి అలాగే విరోచనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

చియ సీడ్స్ ఎవరు తినకూడదు :

* కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఈ విత్తనాలు తినకూడదు ఎందుకంటే వీటిలో పొటాషియం అలాగే ఫాస్పరస్ అనేది ఎక్కువగా ఉంటాయి.

* ప్రోస్టేట్ గ్రంధి సమస్యతో బాధపడే వారు కూడా ఈ విత్తనాలు తినకూడదు ఎందుకంటే వీటిలో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విత్తనాలు తీసుకోవడం వల్ల సమస్య అనేది ఇంకా తీవ్రంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

* గర్భిణీ స్త్రీలు అలాగే చిన్న పిల్లలు కూడా ఈ విత్తనాలు తినకూడదు.

* రక్త పోటు కి సంబంధించిన మెడిసిన్స్ అలాగే షుగర్ వ్యాధికి సంబంధించిన టాబ్లెట్స్ రక్తం పల్చగా అవ్వడానికి టాబ్లెట్స్ ఉపయోగించే వారు మాత్రం డాక్టర్ సలహా మేరకు ఈ విత్తనాలు తినాలి.

Chia Seeds

Leave a Comment