Appendicitis in Telugu| అపెండిసైటిస్ రావడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స విధానం.

అపెండిక్స్ అనేది ఒక నిరుపయోగంగా ఉన్న అవయవం. ఇది పెద్ద పేగు నుంచి తోకాలా చిన్న గొట్టము లాగా బయటకు ఉంటుంది.ఈ అపెండిక్స్ కుడి వైపు ఉంటుంది. ఎప్పుడైన ఈ అపెండిక్స్ ఏదైనా కారణాల వలన వాపు వస్తుందో ఆ సందర్భాన్ని “ఆపెండిసైటిస్” అంటారు. ఈ ఆపెండిసైటిస్ ఎక్కువగా 10-30 ఏళ్ల వయసు వారిలో వస్తుంది.

అపెండిసైటిస్ లక్షణాలు

అపెండిసైటిస్ రావడానికి కారణాలు :

  • అపెండిక్స్ యొక్క లోపలి పొర ఏదైనా కారణాల వలన లింఫాయిడ్ గ్రంథులు వాపు వచ్చి అపెండి సైటిస్ వస్తుంది.
  • పెద్ద పేగు లో మలము పేరుకుపోయినప్పుడు అపెండిక్స్ పైన ఒత్తిడి ఏర్పడి వాపు వస్తుంది.
  • పారాసైట్ ఇన్ఫెక్షన్

అపెండిసైటిస్ లక్షణాలు :

  • నాభి చుట్టూ నొప్పి మొదటగా మొదలవుతుంది, కొన్ని గంటలలో క్రమంగా ఈ నొప్పి అనేది కుడి వైపున దిగువ క్రింది భాగానికి చేరుతుంది.
  • గాబరవడం
  • వాంతులు
  • జ్వరం

అపెండిసైటిస్ నిర్ధారణ పరీక్షలు :

  • ఆ వ్యక్తికి వచ్చిన నొప్పి ప్రకారం వైద్యులు నిర్ధారిస్తారు. ఆపెండిసైటిస్ లో నొప్పి అనేది క్రింద కుడి భాగంలో ఉంటుంది అలాగే Rebound Tenderness ( అపెండిక్స్ ఉన్న చోట కొద్దిగా నొక్కి పెట్టీ బయటకి అంటే తీవ్రమైన నొప్పి వస్తుంది
  • CBP రక్త పరీక్ష – తెల్ల రక్త కణాలు అనేవి 10000 కన్నా అధికంగా ఉంటాయి.
  • మూత్ర పరీక్ష
  • సీ.టీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్

అపెండిసైటిస్ చికిత్స విధానం :

అపెండిక్స్ అనేది నిరుపయోగంగా ఉండే అవయవం కాబట్టి ఎవరికైతే అపెండిక్స్ వాపు వస్తుందో అలాంటి వారు సర్జరీ ద్వారా లేదా లాప్రో స్కోపీ ద్వారా తీసి వేస్తారు.

మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :

Appendicitis in Telugu

Leave a Comment