అమొక్సిసిలిన్ అనేది ఒక బీటా లాక్టం, పెన్సిలిన్ యాంటీ బయోటిక్స్ . బ్యాక్టీరియా వలన వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గించే మందు.
అమొక్సిసిలిన్ టాబ్లెట్స్ ఉపయోగాలు :
- చెవి ఇన్ఫెక్షన్
- ముక్కు దిబ్బడ
- గొంతు ఇన్ఫెక్షన్ ( టాన్సిల్ ,సైనస్ ఇన్ఫెక్షన్ )
- జెనిటల్ ఇన్ఫెక్షన్
- యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ( యూరేత్రైటిస్, సిస్తటిస్, ప్రోస్తేటైటిస్ )
- చర్మ సమస్య
- శ్వాస కోశ వ్యవస్థ ఇబ్బంది ( న్యుమోనియా, బ్రాంకైటిస్ )
- గోనారియ
- H.Pylori ఇన్ఫెక్షన్
- పంటి వాపు
అమొక్సిసిలిన్ ఎన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది :
అమొక్సిసిలిన్ టాబ్లెట్స్( 250 మి.గ్రా , 500 మి.గ్రా.), సిరప్స్ ( 125 mg/5 ml , 250 mg/5ml ) ,I.V ఇంజెక్షన్లు రూపంలో బయట అందుబాటులో ఉంటుంది.
అమొక్సిసిలిన్ ఎంత మోతాదులో తీసుకోవాలి :
అమొక్సిసిలిన్ డోసేజ్ అనేది వ్యక్తి యొక్క వయసు, సమస్య తీవ్రత ప్రకారం ఉంటుంది.
12 ఏళ్ల పై బడిన వారు ప్రతి రోజు ఒక టాబ్లెట్స్ మూడు పూటలు తిన్న తరువాత తీసుకోవాలి.
కనీసం ఐదు రోజులు ఉపయోగించాలి. ఎప్పుడైన అమొక్సిసిలిన్ మొత్తం కోర్స్ తీసుకోవాలి. మధ్యలోనే ఆపివేయడం వలన ఇన్ఫెక్షన్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
అమొక్సిసిలిన్ టాబ్లెట్స్ దుష్ప్రభావాలు :
- గాబరవడం
- వాంతులు
- విరోచనాలు
- చాలా రోజులు ఉపయోగించడం వలన నోటి పూత వచ్చే అవకాశం ఉంటుంది.
అమొక్సిసిలిన్ ఎవరు ఉపయోగించకూడదు :
- పెన్సిలిన్ ఆలేర్జీ
- కిడ్నీ సమస్య
- లివర్ సమస్య ఉన్నవారు డాక్టర్ నీ సంప్రదించి తీసుకోవాలి.