విరోచనాలు ఎందుకు అవుతాయి, తగ్గాలంటే ఏం చేయాలి|Diarrhoea Causes and Treatment in Telugu.

విరోచనాలుని “డయేరియా” అని కూడా అంటారు.

విరోచనాలు

విరోచనాలు రావడానికి గల కారణాలు :

  1. కలుషితమైన నీళ్లు , కలుషితమైన ఆహారం తినడం
  2. కొన్ని ఆహార పదార్థాలు – పచ్చిపాలు, మొలకెత్తిన విత్తనాలు, మాంసాహారం తినడం.
  3. వైరల్ అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, రోటా వైరస్ , సాల్మొనెల్లా టైఫి వలన కూడా విరోచనాలు వస్తాయి.
  4. హైపర్ థైరాయిడ్, అల్సరేటివ్ కోలైటిస్ ,క్రౌన్స్ వ్యాధి తో బాధపడే వారిలో కూడా విరోచనాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
  5. ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఉపయోగించే వారికి
  6. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా విరోచనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

విరోచనాలు యొక్క లక్షణాలు :

విరోచనాలు వచ్చినప్పుడు శరీరంలో ఉన్న నీళ్లు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అందువలన విరోచనాలు ఉన్నవారికి డీహైడ్రేషన్ లక్షణాలు అంటే ఎక్కువగా వస్తాయి.

* దాహం వేయడం ,

* మూత్రం తగ్గడం ,

* చర్మం పొడిబారడం ,

* నోరు ఎండిపోవడం,

* కళ్ళు తిరగడం ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము.

విరోచనాలు ఉన్న వారికి చేయవలసిన నిర్ధారణ పరీక్షలు :

సాధారణంగా విరోచనాలు ఉన్న వారికి ఎటువంటి నిర్ధారణ పరీక్షలు అవసరం ఉండదు కానీ ఎవరికైతే మలంలో రక్తం ఉండడం అలాగే విరోచనాలతో పాటు జ్వరం ఉండడం , విరోచనాలు రెండు వారాల కన్నా ఎక్కువ ఉన్నవారికి కొన్ని నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది.

  1. స్టూల్ కల్చర్
  2. కంప్లీట్ బ్లడ్ పిక్చర్
  3. థైరాయిడ్ రక్తపరీక్ష
  4. లివర్ పరీక్ష
  5. ఎండోస్కోపి
  6. కొలోనిస్కోపీ

విరోచనాలు చికిత్సా విధానం:

విరోచనాలు ఉన్నవారికి

* లోపీరమైడ్(Loperamide),

* బిస్మత్ సబ్బ్సాలి సైట్(Bismuth Subsalisylate)

* రేస్ కదొట్రిల్(Racecadodril)

* యాంటీ బయాటిక్స్ సిప్రోఫ్లోక్ససిన్(Ciproflaxacin) , మెట్రోనిడజోల్( Metronidazole) ఇలాంటి మందులు వైద్యులు సూచిస్తూ ఉంటారు.

విరోచనాలు ఉన్నవారు తినవలసిన ఆహారం:

1.ఎక్కువగా నీళ్లు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ,నిమ్మరసం తీసుకుంటూ ఉండాలి.

2.అరటిపండు, అన్నం, ఆపిల్, గోధుమ పిండితో చేసే ఆహార పదార్థాలు, ఉప్మా, అటుకులు ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉండాలి.

విరోచనాలు ఉన్నవారు తినకూడని ఆహారం :

  • పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు
  • పచ్చి పాలు
  • నూనె వస్తువులు
  • కూరగాయల్లో క్యాబేజీ, ముల్లంగి
  • ఆల్కహాల్,
  • సోడా,
  • కాఫీ
  • ఉల్లిపాయ ఇలాంటివి తినకూడదు.

విరేచనాలు రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు:

* చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచడం,

* తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం

* ఉడికిన ఆహారపదార్థాలు తినడం

* బయటకి వెళ్ళినప్పుడు బాటిల్ నీళ్లు తాగడం వలన కూడా విరోచనాలు రాకుండా నివారించవచ్చు.

మరింత సమాచారం కొరకు ఈ క్రింది విడియో చూడండి.

Leave a Comment