బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి ?
సాధారణంగా గుండె నుంచి రక్తం అనేది రక్తనాళాల ద్వారా వివిధ అవయవాలకు సరఫరా అవుతుంది. ఈ రక్తనాళాలలో రక్తం ఎంత ప్రెషర్తో వెళ్తుంది అని కొలిచేది బ్లడ్ ప్రెషర్.
నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 mm Hg ఉంటుంది.ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ 120/80 mm Hg తన ఎక్కువగా ఉంటుందో అలాంటివారికి రక్తపోటు అని నిర్ధారిస్తారు.
గుండె నుంచి రక్తం అనేది సరఫరా అవుతుంది కాబట్టి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు బిపి ఉన్నవారు తీసుకోవాలి.
అలాగే రక్తనాళాలు వెడల్పు కొరకు పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి పొటాషియం , మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి అలాగే సోడియం వలన రక్తనాళాల వెడల్పు తగ్గి రక్తపోటు వస్తుంది కాబట్టి సోడియం ఉన్న ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
DASH Diet :
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రక్త పోటు ను అదుపులో ఉంచడానికి DASH Diet ప్రతిపాదించింది. DASH అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. DASH డైట్ ఉన్నవారు
- ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ( బ్రౌన్ రైస్, సీరియల్స్, ఓట్స్, గోధుమ బ్రెడ్ ) తీసుకోవాలి.
- సుగర్, స్వీట్ పానీయాలు తక్కువగా తీసుకోవాలి.
- సాటురతెడ్ ఫ్యాట్ ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
- చేపలు, బీన్స్ లాంటివి ఎక్కువగా తినాలని డాష్ డైట్ ప్రతిపాదించింది .
హై బీపీ ఉన్నవారు ఏం తినాలి ?
- సిట్రస్ పండ్లు ( గ్రేప్స్, ఆరంజ్)
- అప్రికాట్
- అవాకాడో
- బనానా
- కొబ్బరి నీళ్లు
- ఫిష్ ( టూన ఫిష్, సాల్మన్ ఫిష్ (
- పుట్ట గొడుగులు
- పచ్చి బఠాణీలు
- దానిమ్మ పండు
- ఆలుగడ్డ
- డ్రై ఫ్రూట్ లో ఎండు ద్రాక్ష, కర్జూర పండు,పిస్తా, వాల్నట్స్
- పాల కూర
- బీట్ రూట్
- టొమాటో
- క్యారట్
- సీడ్స్ లో గుమ్మడి గింజలు, చియ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా తీసుకోవాలి .
హై బీపీ ఉన్నవారు ఏం తినకూడదు ?
- ఉప్పు
- ఆవకాయ
- బయట ఆహారం
- చిప్స్
- ఫ్యాట్ ఎక్కువగా మాంస హారం లాంటివి తక్కువగా తీసుకోవాలి.