స్కార్లెట్ ఫీవర్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ” స్ట్రెప్టో కోకస్ పయోజీన్స్ అనే బాక్టీరియా వలన వస్తుంది.
ఈ జ్వరం తుమ్మిన ,దగ్గిన తుంపర్లు ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
స్కార్లెట్ జ్వరం లక్షణాలు :
- జ్వరం
- గొంతు నొప్పి
- దద్దుర్లు , ఈ దద్దుర్లు అనేవి మొదట వీపు భాగంలో వస్తాయి ఆ తర్వాత నెమ్మదిగా కాళ్ళకి, చేతులకి వ్యాపిస్తాయి. అలాగే ఇవి ఎర్రటి రాష్ పైన చిన్న చిన్న దద్దుర్లు వచ్చి ” సాండ్ పేపర్ ” లాగా ఉంటాయి.
- టన్సిల్ ఇన్ఫెక్షన్
- తల నొప్పి
- కడుపు నొప్పి
- వాంతులు
- నాలుక అనేది స్ట్రా బెర్రీ రంగులో మారుతుంది
- అంగిలి భాగంలో ఎర్ర పడుతుంది
- మెడ భాగంలో ఉన్న లింఫ్ గ్రంథులు వాపు వస్తుంది.
స్కార్లెట్ జ్వరం నిర్ధారణ పరీక్షలు :
- సీబీపి
- సి ఆర్ పి
- ఈ ఎస్ ఆర్ వంటి రక్త పరీక్షలు
స్కార్లెట్ జ్వరం చికిత్స విధానం :
స్కార్లెట్ జ్వరం ఉన్న వారికి పెన్సిలిన్, డిక్లో క్సలిన్ , సిఫాలెక్సిన్ వంటి ఆంటీ బయోటిక్స్ ఉపయోగించామని వైద్యులు సూచిస్తారు
స్కార్లెట్ జ్వరం రాకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి :
- శుభ్రత పాటించడం
- తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం
- తుమ్మినా, దగ్గిన చేతులు అడ్డు పెట్టు కోవడం వలన స్కార్లెట్ జ్వరం రాకుండా నివరించవచ్చు.
మరింత సమాచారం కొరకు క్రింది వీడియో చూడండి: