తాటి ముంజలు ఉపయోగాలు |Benefits of eating Ice Apple in Telugu.

Ice Apple ( తాటి ముంజలు )

* వేసవికాలంలో తాటి ముంజలు తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది ..

* తాటి ముంజలు లో సోడియం , పొటాషియం లాంటి లవణాలు ఉండడంవల్ల శరీరంలో ఏర్పడే డీహైడ్రేషన్ ను కూడా తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతూ ఉంటాయి.

* తాటి ముంజలలో ఫైబర్స్ ,ప్రోటీన్స్, విటమిన్స్, పుష్కలంగా ఉంటాయి అలాగే ఇవి పడి కడుపున తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది .

* తాటి ముంజలు గర్భిణీ స్త్రీలు అలాగే పాలిచ్చే తల్లులు కూడా తీసుకోవచ్చు .

* తాటి ముంజలు లో పాలీఫినాల్స్ ఉండడంవల్ల చర్మసౌందర్యానికి ఇది చాలా సహాయపడుతూ ఉంటాయి.

* అలాగే వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి నీళ్లు ఎక్కువగా ఉంటాయి అందు వలన ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారా వారికి కూడా ఇది చాలా సహాయపడుతూ ఉంటాయి.

* తాటి ముంజలు షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తీసుకోవచ్చు .

ఈ తాటి ముంజలు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి అలాగే జుట్టు దృఢత్వానికి కూడా చాలా సహాయపడుతుంది.

తాటి ముంజలు తినేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

తాటి ముంజలు లేతవి తీసుకోవాలి ; ముదురినవి ఎక్కువగా తినకూడదు . ముదిరిన తాటి ముంజలు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటుంది అలాగే ఇవి తాజాగా ఉన్నప్పుడే తీసుకోవాలి.

తాటి ముంజలు ఉపయోగాలు.

Leave a Comment