వర్టిగో అంటే కళ్ళు తిరగడం, తల తిరగడం, బ్యాలెన్స్ తప్పడం, మన చుట్టూరా ఉన్న ప్రదేశం గిర్రున తిరగడం.
లోపలి చెవి భాగంలో ఉన్న సెమీ సర్కులర్ కెనాల్స్ గొట్టాలు అలాగే ఓటోలితిక్ ఆర్గాన్స్ లో ఉన్న క్రిస్టల్స్ బ్యాలెన్స్ కి చాలా సహాయపడతాయి.
తల అనేది కదిలించినప్పుడు ఈ సెమీ సర్కులర్ కెనాల్స్ లో ఉన్న ద్రవం ఎన్డోలింఫ్ అనేది తల ఎటు జరుగుతుంటే అటువైపు ద్రవం కదులుతుంది. ఇలా అవ్వడం వలన వెస్టిబులార్ నరం సెన్స్ అయ్యి అక్కడి నుంచి సిగ్నల్స్ మెదడుకు వెళ్లి ఆ తరువాత ఆక్యులో మోటర్ నరం ద్వారా వెన్నుపూసకు వెళ్లి బ్యాలెన్స్ కు సహాయపడుతుంది
కానీ కొన్ని సందర్భాల్లో ఈ సిగ్నల్స్ అనేవి తప్పి వెర్టిగో వస్తుంది.
సాధనంగా మనం రోజూ చేసే పనులలో కూడా కళ్ళు తిరగడం ,తల తిరగడం చూస్తూ ఉంటాము .ఎప్పుడైనా రంగులరాట్నం ఎక్కిన లేదా మన చుట్టూ మనం వేగంగా తిరిగినా ,సడన్గా ఆగినట్లయితే మనకు కళ్ళు అనేవి తిరుగుతాయి.
వర్టిగో రావడానికి కారణాలు :
- వైరల్ ఇన్ఫెక్షన్
- కోవిడ్ వైరస్ నుండి రికవర్ అయిన వారిలో
- జలుబు ,దగ్గు
- చెవి భాగం లో ఉన్న కొన్ని కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ వేరే చోటికి బదిలీ అవ్వడం
- చెవి భాగం లో ఉన్న సెమీ సర్కులర్ కెనాల్స్ లో ఎక్కువగా ఎండో లింఫ్ అనే ద్రవం ఎక్కువగా అవ్వడం
- మెదడు కి దెబ్బ తగిలినప్పుడు
- వయసు పైబడిన వారిలో
- నరాల ఇబ్బంది
- విటమిన్ బి 12, విటమిన్ ” డి ” లోపం
- రక్తంలో సోడియం లెవెల్స్ తగ్గడం
- లో బీపీ
- రక్తంలో సుగర్ లెవెల్స్ తగ్గడం
- మెదడు స్ట్రోక్, మెదడు లో కణితులు రావడం వలన వర్టిగో వచ్చే అవకాశం ఉంటుంది.
వెర్టిగో చాలా రకాలుగా వస్తూ ఉంటుంది .ఎక్కువగా బినైన్ పారక్సిమల్ పోసిషనల్ వర్టిగో ( BPPV ) చూస్తూ ఉంటాము.
బినైన్ పారక్సిమల్ పోసిషనల్ వర్టిగో ( BPPV ) :
బినైన్ పారక్సిమల్ పోసిషనల్ వర్టిగో ( BPPV ) అనేది చాలా వరకు చూస్తూ ఉంటాము. వైరల్ ఇన్ఫెక్షన్ ( జలుబు, దగ్గు) ఉన్నవారిలో , కారొన వైరస్ నుండి రికవర్ అయిన వారిలో ఎక్కువగా వస్తుంది.
ఓటోలితిక్ ఆర్గాన్స్ లో ఉన్న కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ సెమీ సర్కులర్ కెనాల్స్ గొట్టాలు లోకి వెళ్ళినప్పుడు ఈ వర్టిగో చూస్తూ ఉంటాము.
బినైన్ పారక్సిమల్ పోసిషనల్ వర్టిగో ( BPPV ) లక్షణాలు :
- బినైన్ పారక్సిమల్ పోసిషనల్ వర్టిగో ( BPPV ) లో కళ్ళు తిరగడం అనేది పొజిషనల్ గా ఉంటుంది. అంటే తల తిప్ప నప్పుడు ఎటువంటి ఇబ్బందీ ఉండదు కానీ తల నీ కదిలించి నప్పుడు ,లేదా పడుకున్నప్పుడు, వాకింగ్ చేసినపుడు వెంటనే కళ్ళు తిరుగుతాయి.
- ఈ కళ్ళు తిరగడం అనేది ఒక నిమిషం కన్నా తక్కువగా ఉంటుంది.
మెనేయర్స్ డిసీజ్ | Meniers Disease :
* సెమీ సర్కులర్ కెనాల్స్ లో ఎక్కువగా ద్రవం ( ఎక్కువ ఎండో లింఫ్ ) ఉండడం వలన ఈ ఇబ్బంది వస్తుంది.
* ఈ మేనీయర్స్ డిసీజ్ లో కళ్ళు తిరగడం అనేది చాలా సమయం ( గంటలు ) వరకు ఉంటుంది.
* కళ్ళు తిరగడం తో పాటు చెవిలో ఎదో గంట కొట్టి నట్టు అనిపిస్తుంది.
* అలాగే కళ్ళు తిరగడం అనేది అకస్మాత్తుగా వస్తుంది.
వర్టిగో ఉన్నవారు ఏ వైద్యుడు ని సంప్రదించాలి :
ENT వైద్యుడు లేదా నరాల స్పెషలిస్ట్ నీ సంప్రదించాలి.
వర్టిగో నిర్ధారణ పరీక్షలు :
- హాల్ పైక్ మాన్యివర్
- విటమిన్ డి, విటమిన్ బి 12 రక్త పరీక్ష
- సుగర్ పరీక్ష
- సీ. టీ స్కాన్, MRI స్కాన్
వర్టిగో ఉన్న వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి :
- ఒత్తిడి తగ్గించాలి (ఎక్కువగా వ్యాయామం, యోగా చేయడం )
- సరియైన నిద్ర పోవడం
- నిద్ర పోయేముందు తల కింది భాగంలో రెండు దిండు లు పెట్కోడం
- పడుకొని లేచి నప్పుడు సడన్ గా నిల పడ కూడదు , కూర్చొని నెమ్మదిగా నిలబడాలి.
- ఎక్కువగా నీళ్లు తీసుకోవడం, గోరు వెచ్చని నీటిలో తేనె , ఏపిల్ సైడర్ వినెగార్ కలుపుకొని తాగడం
- కాఫీ తాగడం తగ్గించాలి.
వర్టిగో వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి :
వర్టిగో ఉన్నవారు ” ఎప్లీ మన్యువర్ ” Epley Manuever చేయడం వలన వర్టిగో ను కొద్ది వరకు తగ్గించ వచ్చు. ఈ ఏప్లే మన్యువర్ లో నాలుగు స్టెప్స్ ఉంటాయి.
Step 1 : మొదటగా తలని 45⁰ తిప్పాలి ( మీకు వర్టిగో ఎటువైపు వలన వచ్చిందో ఆ వైపు తల తిప్పాలి ),ఆ తర్వాత నెమ్మదిగా పడుకోవాలి . ఈ పొజిషన్ ఒక 30 సెకండ్ లు ఉండాలి.
Step 2 : ఇప్పుడు తలను వేరే వైపు తిప్పాలి(సుమారు 90 ⁰ తిప్పాలి) ఈ పొజిషన్లో ఒక 30 సెకండ్ లు ఉండాలి.
Step 3 : ఇప్పుడు నెమ్మదిగా తలను ఒక వైపు తిప్పాలి. ఈ పొజిషన్ లో మినిమం 30 సెకండ్ లు ఉంచాలి.
Step 4 : ఆ తర్వాత నెమ్మదిగా కూర్చోవాలి. కూర్చున్నప్పుడు తల కిందికి వంచి పెట్టాలి. ఈ పొజిషన్ మినిమం 15 నిమిషాల పాటు ఉంచాలి.
ఇలా చేయడం వలన వర్టిగో కొద్ది వరకు తగ్గించ వచ్చు. మరి కొందరికి వైద్యులు ” Vertin 8 mg, 16 mg ” tablets సూచిస్తారు.
మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :