Vitamin”డి” ని “సన్ షైన్ విటమిన్” అని కూడా పిలుస్తారు , ఎందుకంటే 90 % విటమిన్ డి సూర్య కిరణాలు నుంచి ఉత్పత్తి అవుతుంది.
విటమిన్ “డి” ఎవరిలో తక్కువ ఉంటుంది ?
- ఎక్కువగా ఇంట్లో ఉన్న వారికి
- ఇంట్లో నుండి పని చేసే వారికి
- వయసు పై బడిన వారు
- నల్లగా ఉన్నవారు
- సన్ స్క్రీన్ లోషన్ ఎక్కువగా పెట్టే వారిలో
- కిడ్నీ సమస్య ఉన్న వారు
- లివర్/ కాలేయ సంబంధిత ఇబ్బంది ఉన్నవారిలో విటమిన్ ” డి ” తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
విటమిన్ “డి ” తక్కువగా ఉంటే ఎటువంటి లక్షణాలు కనపడతాయి ?
- ఎముకల దృఢత్వం తగ్గుతుంది
- నడుము నొప్పి
- కండరాల నొప్పి
- తొందరగా అలిసి పోవడం
- తిమ్మిర్లు
- జుట్టు ఊడి పోవడం లాంటి లక్షణాలు కనపడతాయి.
విటమిన్ “డి” నార్మల్ లెవెల్స్ ఎంత ఉండాలి ?
విటమిన్ “డి” లెవెల్స్ రక్తంలో “కేమి ల్యూమి నిసెన్స్” (CLIA ) అనే పద్ధతి లో చూస్తారు.
* విటమిన్ “డి” నార్మల్ లెవెల్స్ 30 – 100 ng/ml ఉండాలి.
* 10 ng/ml తక్కువగా ఉంటే వారికి విటమిన్ డి తక్కువగా ఉన్నట్టు.
* 10 – 30 ng/ml ఉన్నవారికి విటమిన్ డి లెవెల్స్ సరిపడా లేవు అని అర్దం.
* 100 ng/ml ఎక్కువ ఉన్నవారికి విటమిన్ “డి” నార్మల్ కన్నా అధికంగా ఉంది .