విటమిన్ “డి” టాబ్లెట్స్ ఎలా ఉపయోగించాలి ?

విటమిన్ డి నీ ” సన్ షైన్ విటమిన్” అని కూడా అంటారు ఎందుకంటే 90% విటమిన్ సూర్య కిరణాలు నుంచి ఉత్పత్తి అవుతుంది.

విటమిన్ “డి” ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి,రోగ నిరోధక శక్తిని పెంచడానికి ,అలసత్వాన్ని తగ్గించడానికి చాలా సహాయ పడుతుంది.

Vitamin D Tablets

విటమిన్ ” డి” టాబ్లెట్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి :

0 – 1 సంవత్సరం – 400 IU ( 10 mcg)

1-18 సంవత్సరం – 600 IU ( 15 mcg )

19-70 సంవత్సరం – 600 – 800 IU ( 15 -20 mcg )

> 70 సంవత్సరం పై బడిన వారు – 800 IU ( 20 mcg )

గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు – 600 IU ( 15 mcg )

విటమిన్ “డి” టాబ్లెట్స్ ఎవరు ఉపయోగించాలి :

  • రక్తం లో కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నవారు
  • విటమిన్ “డి” తక్కువ ఉన్నవారు
  • ఆస్టియో పోరోసిస్
  • హైపో ప్యారా థైరాయిడ్
  • టేటానీ

విటమిన్ “డి” ఎన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది :

విటమిన్ డి టాబ్లెట్స్, క్యాప్సుల్స్,లిక్విడ్స్, డ్రాప్స్ రూపంలో బయట మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.

అలాగే విటమిన్ “డి” 2000 IU, 5000 IU, 60000 IU లో అందుబాటులో ఉంటుంది.

విటమిన్ “డి” 60000 IU ఎలా ఉపయోగించాలి :

ఎవరికైతే విటమిన్ “డి” తక్కువగా ఉంటుందో అలాంటి వారు విటమిన్ డి టాబ్లెట్స్ వారానికి ఒక సారి,తిన్న తర్వాత,మధ్యాహ్నం పూట ఈ టాబ్లెట్ తీసుకోవాలి. ఇలా ఆరు వారాలు తీసుకోవాలి. ఆరు వారాలు విటమిన్ డి టాబ్లెట్స్ ఉపయోగించిన తర్వాత ప్రతి నెలకి ఒకసారి విటమిన్ డి టాబ్లెట్స్ ఉపయోగించాలి.

ఎవరికైతే విటమిన్ డి నార్మల్ లెవెల్స్ లో ఉంటాయో అలాంటి వారు నెలకి ఒకసారి విటమిన్ డి 60000 IU టాబ్లెట్ తీసుకోవాలి.

విటమిన్ “డి ” టాబ్లెట్ దుష్ప్రభావాలు :

  • మల బద్ధకం
  • గాబరవడం
  • వాంతులు

విటమిన్ “డి ” టాబ్లెట్స్ ఎవరు తీసుకోకూడదు :

  • గర్భవతులు
  • పాలు ఇచ్చే తల్లులు
  • కిడ్నీ సమస్య
  • గుండె సంబంధిత ఇబ్బంది
  • రక్తంలో కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్నవారు ఒకసారి వైద్యుడు నీ సంప్రదించి విటమిన్ డి టాబ్లెట్స్ తీసుకోవాలి.

అలాగే కిడ్నీ సమస్య కి ఉపయోగించే అల్యూమినియం టాబ్లెట్స్, ఫిట్స్ కి ఉపయోగించే డిజాక్సిన్, కొవ్వుని కరిగించే అత్రావాస్తాటిన్,సోరియాసిస్ కి ఉపయోగించే కాల్సిపొట్రింన్ ,గుండె సంబంధిత ఇబ్బందికి ఉపయోగించే టాబ్లెట్స్ తీసుకునే వారు ఒకసారి డాక్టర్ నీ సంప్రదించి విటమిన్ డి టాబ్లెట్స్ తీసుకోవాలి.

Leave a Comment