వడదెబ్బ లక్షణాలు,రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు|Sun Stroke in Telugu.

Sun Stroke

వడదెబ్బ వేసవికాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ వడదెబ్బ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వడదెబ్బ రావడానికి గల కారణాలు:

  • ఎండలోఎక్కువగా పని చేసేవారికి.
  • చిన్నపిల్లలు ఎక్కువ సమయం మధ్యాహ్నం పూట బయట ఆడుకునే వారికి

వడదెబ్బ ఎవరిలో ఎక్కువగా వస్తుంది :

  • 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులకు
  • 65 ఏళ్లు పైబడిన వారికి
  • షుగర్ వ్యాధి, గుండె సమస్యలతో బాధపడే వారికి
  • స్థూలకాయం ఉన్న వారికి
  • ప్రెగ్నెన్సీ
  • స్మోకింగ్ , ఆల్కహాల్ తాగే వారికి ఈ వడ దెబ్బ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వడదెబ్బ లక్షణాలు :

  • తలనొప్పి
  • తీవ్రమైన జ్వరం
  • వాంతులు
  • విరోచనాలు
  • తల తిరిగినట్లు ఉండడం
  • చెమటలు రాకుండా శరీర ఉష్ణోగ్రత పడిపోవడం
  • శ్వాస వేగంగా ఉండడం
  • గుండె దడ ఎక్కువగా ఉండడం
  • మూత్రం పచ్చగా ఉండటం

వడదెబ్బ వచ్చిన వారిలో ప్రథమ చికిత్స :

  • వడదెబ్బ వచ్చిన వారిని నీడ ప్రదేశములో తీసుకెళ్లాలి
  • బట్టలు కొద్దిగా వదులుగా చేయాలి
  • వడదెబ్బ సోకిన వ్యక్తికి కళ్లు తిరిగినట్లు అనిపించినట్లయితే ఆ వ్యక్తి యొక్క కాళ్లను కొద్దిగా పైకి ఉంచాలి
  • తడిబట్ట అనేది తల భాగం , మెడ భాగం బాహుమూలం లో/ సంక అలాగే గజ్జ దగ్గర పెట్టి ఉంచాలి.
  • నీళ్లు లేదా నిమ్మరసం ఇలాంటివి ఇవ్వాలి.
  • వడదెబ్బ తీవ్రంగా ఉన్నట్లయితే దగ్గర్లో ఉన్న డాక్టర్ని లేదా దగ్గరలో ఉన్న హాస్పిటల్ ని సంప్రదించాలి.

వడదెబ్బ రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు :

  • బయటకి వెళ్ళినప్పుడు గాలాడే కాటన్ దుస్తులు ధరించాలి
  • టోపీ , సన్ గ్లాసెస్ అలాగే సన్ స్క్రీన్ లోషన్ బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవాలి.
  • వేసవి కాలంలో ఎక్కువగా నీళ్లు తాగడం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, గ్లూకోస్ ,ఓ ఆర్ ఎస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి
  • వడదెబ్బ ఎక్కువగా ఎవరైతే చిన్నపిల్లలను కారులో వదిలేసి వెళ్లిపోతుంటారో వారిలో వస్తు ఉంటుంది. అందువల్ల పిల్లలను ఎప్పుడు వేసవికాలంలో కార్ లో వదిలేసి వెళ్ళకూడదు.

మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి

Leave a Comment