సాధారణంగా గుండె నుంచి రక్తం అనేది రక్తనాళాల ద్వారా వివిధ అవయవాలకు సరఫరా అవుతూ ఉంటుంది. ఈ రక్తనాళాలలో రక్తం ఎంత ప్రెషర్తో వెళ్తుంది అని కొలిచేది బ్లడ్ ప్రెషర్.
సాధారణంగా బీపీ 120/80 mm Hg ఉంటుంది. ఎవరికైతే బిపి 90/60 mm Hg కన్న తక్కువగా ఉంటుందో అలాంటివారికి లో బిపి అని పరిగణలోకి తీసుకుంటారు.
లో బిపి రావడానికి గల కారణాలు :
- డిహైడ్రేషన్ : డిహైడ్రేషన్ ఎక్కువగా వాంతులు, విరోచనాలు, జ్వరం లాంటి సందర్భాల్లో డిహైడ్రేషన్ అవుతుంది. డిహైడ్రేషన్ అవ్వడం వలన, శరీరంలో బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. అందువల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది.
- బ్లడ్ లాస్ : ఆడవారిలో వచ్చే నెలసరి , ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ,లేదా కడుపులో ఏదైనా అల్సర్స్ వచ్చినప్పుడు కూడా బ్లడ్ లాస్ అవుతుంది అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతూ ఉంటుంది.
- గుండె నుంచి రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఎవరికైతే గుండె సంబంధిత ఇబ్బంది (అరితిమియా, వాల్వులర్ స్టీనోసిస్) ఉంటుందో అలాంటి వారిలో లో బీపీ చూస్తాము.
- కొన్ని రకాల మందులు ఉపయోగించడం , బిపి తగ్గించే మెడిసిన్స్ (Metapralol) , వాటర్ పిల్స్ ( Frusemide) ,యాంటీ దిప్రెసాంట్స్ ( Amitriptyline) .
- ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని మార్పుల వలన రక్తనాళాలు యొక్క వెడల్పు పెరుగుతుంది, అందువలన కూడా లోబీపీ వస్తుంది. ఎక్కువగా 1 వ ట్రైమినిస్టర్ 24 వారాల ప్రెగ్నెన్సీలో లో బి పి ఎక్కువగా చూస్తాము ; డెలివరీ అయిన తర్వాత ఈ లో బీపీ తగ్గిపోతుంది.
- కొన్ని హార్మోనల్ సంబంధిత ఇబ్బంది ఉన్నవారు ( Addisons Disease) , Hypo glycemia ( లో సుగర్ లెవెల్)
- రక్త హీనత, విటమిన్ బి 12 , ఫోలేట్ , ఐరన్ తక్కువగా ఉన్న వారిలో కూడా లో బీపీ వస్తుంది.
లో బీపీ లక్షణాలు :
- త్వరగా అలసిపోవడం
- కళ్ళు తిరగడం
- తల తిరగడం
- ఒళ్లంతా చెమటలు పట్టడం
- ఒళ్ళు చల్లబడిపోవడం
- తీవ్రంగా లో బీపీ ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు ఉంటాయి .
లో బీపీ నిర్ధారణ పరీక్షలు :
- లో బీ పీ ఉందో లేదో తెలుసుకోవడానికి మొదటగా బిపి చెక్ చేయించుకోవాలి.
- రక్త పరీక్షలు : హిమోగ్లోబిన్ లెవెల్స్, విటమిన్ బి12, షుగర్ టెస్ట్
- గుండె సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈసీజీ లాంటి పరీక్షలు చేయించుకోవాలి.
లో బి.పి రకాలు :
1) ఆర్తోస్టాటిక్/ పోస్తురల్ హైపో టెన్షన్ :
ఈ ఆర్తోస్టాటిక్/ పోస్తురల్ హైపోటెన్షన్ ఎక్కువగా వయసు పై బడిన వారిలో , ప్రెగ్నెన్సీ మహిళలు లో చూస్తూ ఉంటాము.
ఎవరైతే చాలా సమయం వరకు పడుకొని లేదా కూర్చొని వెంటనే నిలబడతారో అలాంటి వారిలో బీపీ లెవెల్స్ అమాంతం తగ్గుతాయి.
ఢీహైడ్రేషన్, చాలా కాలం నుంచి మoచానా ఉన్నవారు, కొన్ని మెడికల్ సమస్యల వలన కూడా ఆర్తోస్టాటిక్/ పోస్తురల్ హైపో టెన్షన్ చూస్తాము.
పోస్ట్ ప్రాండియల్ హైపో టెన్షన్ :
కొందరిలో తిన్న తర్వాత 1-2 గంటల తర్వాత సడన్ గా బిపి లెవెల్స్ తగ్గి పోతాయి.ఈ పరిస్థితిని పోస్ట్ ప్రాండియాల్ హైపోటెన్షన్ అంటారు.
వయసు పై బడి హై బీపీ సమస్య భాధ పడుతున్న వారిలో ఎక్కువగా ఈ ఇబ్బంది వస్తుంది.
ఇలాంటి సమస్యతో భాధ పడేవారు కార్బోహైడ్రేట్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి, ఎక్కువగా నీళ్లు తాగడం , మధ్య పానం తగ్గించడం లాంటి జాగ్రత్తలు పాటించాలి.
న్యూరల్ మీడియేటెడ్ హైపోటెన్షన్ :
ఎవరైతే ఎక్కువ సమయం నిల్చొని ఉంటారో అలాంటి వారిలో లో బీపీ చూస్తాము .ఈ హైపో టెన్సన్ ఎక్కువగా చిన్న పిల్లలలో వస్తుంది.
లో బీపీ లక్షణాలు :
లో బీపీ ఉన్నవారికి రక్తం సరిపడా అవయవాలకు సరఫరా అవ్వదు. అందువలన కొన్ని లక్షణాలు కనపడతాయి.
- తొందరగా అలసి పోవడం
- కళ్ళు తిరగడం
- తల తిరగడం
- ఒళ్లంతా చెమటలు పట్టడం
- ఒళ్ళు చళ్ళబడి పోవడం
- తీవ్రంగా ఉన్నపుడు గుండె దడ లాంటి లక్షణాలు కనపడతాయి.
లో బీపీ నిర్ధారణ పరీక్షలు :
- బీపీ చెక్ చేయడం
- హిమోగ్లోబిన్ అలాగే షుగర్ పరీక్ష
- గుండె నిర్ధారణ పరీక్ష ఈసిజి
- టిల్ట్ టేబుల్ టెస్ట్ పోస్టుల హైపొటిషన్ నిర్ధారణ.
లో బీపీ చికిత్స విధానం :
లో బీపి చికిత్స విధానం అనేది లో బిపి రావడానికి గల కారణం ప్రకారం చికిత్స ఉంటుంది.
ఒకవేళ లో బిపి అనేది డీహైడ్రేషన్ వల్ల వస్తే ఎక్కువగా నీళ్లు తాగడం, ఎలక్ట్రోలైట్స్ పౌడర్ తీసుకోవడం, తీవ్రమైన సందర్భాల్లో సెలైన్ ఎక్కించడం లాంటివి చేయాలి.
అధిక రక్తస్రావం వల్ల లోబీపీ వచ్చినట్లయితే బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ చేయాలి.
అలాగే లోబీపి అనేది బిపి టాబ్లెట్స్ యొక్క డోసేజ్ వచ్చినట్లయితే టాబ్లెట్స్ యొక్క మోతాదు మార్చాలి.
లో బీపీ కాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి :
- ఎక్కువగా నీళ్లు మంచిగా తాగడం.
- పోస్తూరల్ హైపో టెన్షన్ సమస్యతో బాధపడేవారు వెంటనే నిలబడకూడదు ,10 సెకండ్లు కూర్చొని ఆ తర్వాత నెమ్మదిగా నిలబడాలి.
- చాలా సమయం నిలబడడం, చాలా సమయం పాటు కూర్చోడం లాంటివి చేయకూడదు.
- రక్తహీనత సమస్యతో బాధపడేవారు బీట్రూట్ జ్యూస్ దానిమ్మ పండు జ్యూస్ గోధుమ గడ్డి జ్యూస్ లాంటివి తీసుకోవాలి.
- కార్బోహైడ్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
లో బీపీ తగ్గించే ఆసనాలు :
క్రాస్ లెగ్ పొజిషన్, స్క్వాట్ పొజిషన్, బాడీ టెన్షన్ పొజిషన్ లాంటివి చేయడం వలన కూడా బిపి నివారించ వచ్చు.
మరింత సమాచారానికి క్రింది విడియో చూడండి :