రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్.
సాధరణంగా బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ దాడి చేసినప్పుడు, మన రోగ నిరోధక శక్తి అనేది వీటిని నాశనం చేస్తుంది. కానీ ఈ ఆటో ఇమ్మ్యూన్ ప్రాబ్లం ఉన్న వారిలో మన శరీరంలో ఉన్న ఖనితులనే బయటనుంచి వచ్చే విదేశీ ఇన్ఫెక్షన్ అనుకొని మన రోగ నిరోధక శక్తి అనేది ఈ ఆరోగ్య కనితుల పైన దాడి చేస్తుంది వీటిని మనం ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటాము.
ఈ రుమటాయీడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఆడవారిలో ,30 నుండి 50 ఏళ్ల సంవత్సరాలు ఉన్న వారిలో అలాగే జన్యుపరంగా ఇబ్బందులు కుటుంబంలో ఎవరికైనా ఈ ఇబ్బంది ఉన్న, మద్యపానం, ధూమపానం చేసేవారిలో, వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
సాదరణంగా రెండు ఎముకలను కలిపేది జాయింట్ లేదా కీళ్లు అంటాము. ఈ కీళ్లను కప్పి ఉంచేది క్యాప్సూల్. ఈ క్యాప్సూల్ కి సైనోవియం లైనింగ్ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో రోగనిరధక శక్తి అనేది కీళ్ళను కప్పి ఉన్న కణజాలఅనాజాలంపై దాడి చేస్తుంది. దీనివలన కీళ్ల లైనింగ్ కణజాలం మందంగా మారుతుంది వీటితోపాటు కీళ్లలో నొప్పి, దృఢత్వం, కీళ్ల వాపు చూస్తూ ఉంటాము.
ఈ ఇబ్బంది తీవ్రంగా ఉన్నట్లయితే ఎముకలను కూడా నాశనం చేస్తూ ఉంటుంది . రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల నొప్పి అనేది ఉదయం లేవగానే గంట వరకు తీవ్రంగా ఉంటుంది ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది.
కీళ్ల నొప్పితో పాటు జ్వరం, అలసట, ఆకలి వేయకపోవడం లాంటి లక్షణాలు చూస్తాము. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా చేతులు, మణికట్టు, అడుగులు, మోచేతులు, మోకాలు ,చీలి మండల పై ఎక్కువగా ప్రభావం చూపుతుంది..
కీళ్లవాతం అనేది కుడి భాగంలో ఉన్నట్లయితే ఎడమ భాగంలో కూడా ఈ ఇబ్బంది వస్తుంది .కీళ్లవాతం తీవ్రంగా ఉన్నట్లయితే కీళ్లవాతంతోపాటు గుండె ఊపిరితిత్తులు కంటిపై కూడా ఈ ప్రభావం చూపుతాయి.
కీళ్లవాతం ఉన్నవారిలో కీళ్లు అనేవి ఓ విధమైన ఆకారంలో కనబడతాయి. వీటిని మనం Ulnar Deviation of Fingers, Button Hole deformity, Swan neck Deformity అని అంటాము.
రుమతేడ్ ఆర్థరైటిస్ లక్షణాలు :
- కీళ్ల వాపు
- కీళ్ల నొప్పి
- కీళ్ల నొప్పి తీవ్రంగా ఉదయం పూట లేవగానే ఉండడం
- కీలు దృడ్డత్వం ఉండడం
- జ్వరం
- అలసట
- ఆకలి వేయకపోవడం
కీళ్లవాతం నిర్ధారణ పరీక్షలు :
- CRP రక్త పరీక్ష
- ESR test
- TNF పరీక్ష
- RF ( రుమటైడ్ ఫాక్టర్ )
- Anti CCP ( Anti Citrullinated Peptide ) పరీక్ష
- X ray ఎక్స్ రే
- MRI
రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు రుమటాలజిస్ట్ ఆర్థోపెడిషన్ వంటి డాక్టర్లను సంప్రదించాలి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్స విధానం :
కీలు నొప్పి ఉన్నవారికి NSAIDS ( Ibuprofen) వంటి నొప్పి మాత్రలు , Corticosteroids వంటి టాబ్లెట్స్ ఇస్తారు.
DMARDS ( Disease Modifying Anti Rheumatoid Medicine) – Methotrexate, Hydroxy Chloroquine, Sayasalazine
Biological Response Modifiers: Abatacept, Rituximah వంటి టాబ్లెట్స్ ఉపయోగించమని వైద్యులు సూచిస్తారు.