మైగ్రేన్ ఒక రకమైన తలనొప్పి. ఈ మైగ్రేన్ ఉన్నవారికి తలనొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది.
మైగ్రేన్ రావడానికి గల కారణాలు :
- తలలో ఉన్న రక్తనాళాలు వెడల్పు మందంగా అవ్వడం లేదా సన్నగా అవ్వడం వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది
- అలాగే తలకి ఉండే ట్రై జేమినల్ నరానికి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది.
మైగ్రేన్ ఎక్కువగా ఎవరిలో వస్తుంది :
- ఆడవారిలో హార్మోన్ చేంజెస్ వలన ఎక్కువగా చూస్తూ ఉంటాము
- మద్యపానం , కాఫీ ఎక్కువగా తీసుకునే వారిలో
- ఒత్తిడి
- సరియైన నిద్ర లేకపోవడం
- వాతావరణం మార్పిడి వల్ల
- కొన్ని మందులు నైట్రో గ్లిసరిన్ , కాంట్రాసెక్టివ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
మైగ్రేన్ లక్షణాలు :
- మైగ్రెయిన్ వచ్చేముందు కొన్ని లక్షణాలు కనబడతాయి .వీటిని ఆరా అంటాము. ఈ ఆరా ఉన్నవారిలో ఎక్కువగా ఈ లక్షణాలు కనబడతాయి
- ఆవలింతలు ఉండడం
- తొందరగా అలిసిపోవడం
- కొద్దిపాటి వెలుతురు వచ్చినా గాని చాలా చికాకు ఉండడం
- కొద్దిపాటి చప్పుడు విన్నా గాని తలనొప్పి రావడం
- మన చుట్టూ ఉన్న ప్రదేశం అనేది తిరిగినట్టు ఏమీ కనబడకుండా ఉండడం
- ఆకలి, దాహం వేయడం
- చెవిలో ఏదో చప్పుడు లాంటి శబ్దం రావడం
- చెమటలు పట్టడం వంటి లక్షణాలు మైగ్రేన్ కన్నా ముందు వస్తాయి.
మైగ్రేన్ లో తలనొప్పి అనేది ఎక్కువగా ఒకవైపే కుడి లేదా ఎడమవైపు ఉంటుంది . అలాగే నొప్పి అనేది చాలా తీవ్రంగా సుత్తితో కొడుతున్నట్టు ఉంటుంది. ఈ నొప్పి సుమారు నాలుగు గంటల నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. ఏదైనా పని చేసినప్పుడు తలనొప్పి అధికంగా ఉండడం విశ్రాంతి తీసుకున్నప్పుడు నొప్పి అనేది తగ్గడం వంటివి చూస్తాము.
తలనొప్పి తో పాటు గాబరావడం, వాంతులు ముక్కులో నుంచి నీళ్లు రావడం ,కళ్ళలో నుంచి నీళ్లు రావడం వంటివి చూస్తాము.
మైగ్రేన్ తగ్గిన తర్వాత చాలా అలసట ఉండడం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి.
మైగ్రేన్ నిర్ధారణ పరీక్షలు :
- మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు నరాలు డాక్టర్ న్యూరాలజిస్ట్ ని సంప్రదించాలి . డాక్టర్ గారు మీకున్న లక్షణాలు ప్రకారం ఒక అవగాహనకు వస్తారు, తీవ్రంగా ఉన్నట్లయితే కొన్ని పరీక్షలు చేయించమని సూచిస్తారు.
- ఈ ఈ జి ( ఎలక్ట్రో ఏన్సోఫోలోగ్రామ్ )
- ఎమ్మారై , సిటీ స్కాన్ వంటివి తీవ్రంగా ఉన్నట్లయితే చేయించుకోవాలి.
మైగ్రేన్ ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి :
- తలనొప్పి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడం
- మైగ్రేన్ ఉన్నవారు వెలుతురు ప్రదేశంలో కాకుండా కొద్దిగా చీకటి ఉన్న ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి.
- సరైన టైం కి నిద్రపోవడం చేయాలి .అధికంగా లేదా తక్కువ సమయం నిద్రపోకూడదు.
- నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి
- వ్యాయామం మెడిటేషన్ యోగ వంటివి చేయాలి
- తలనొప్పి ఉన్నప్పుడు ఏదైనా తడి బట్ట తల పైన పెట్టుకోవడం వంటివి చేయాలి
- తలని మసాజ్ చేయడం వంటివి చేసినా కానీ మైగ్రేన్ తలనొప్పి కొద్దివరకు తగ్గించవచ్చు.
మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :