మలబద్దకం నీ మెడికల్ టెర్మినాలజీ లో “Constipation ( కాన్స్టిపేషన్) అంటారు .
మలబద్దకం రావడానికి కారణాలు :
- నీళ్లు తక్కువగా తీసుకోవడం
- పీచు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు
- వ్యాయామం చేయని వారు
- వయసు పై బడిన వారు
- గర్భవతులు
- ఒత్తిడి
- పైల్స్,ఫిషర్, ఫిస్టులా
- హైపో థైరాయిడిిసం
- రక్తంలో పొటాషియం తక్కువగా ఉన్న వారు
- సుగర్ లెవెల్ ఎక్కువగా ఉన్నవారు
- ఇరైటబుల్ బోవల్ సిండ్రోమ్
- Anti Histamine, Anti depressants,Iron supplements లాంటి మెడిసిన్ వలన కూడా మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది.
మలబద్దకం లక్షణాలు :
- వారానికి మూడసార్లు కన్నా తక్కువగా మలానికి వెళ్ళడం
- మాలానికి వెళ్ళినప్పుడు నొప్పి ఉండడం
- మలం గట్టిగా ఉండడం
- మలం సాఫీగా వెళ్లక పోవడం లాంటి లక్షణాలు కనపడతాయి.
మలబద్దకం రాకుండా ఉండాలంటే పాటించవలసిన ఇంటి చిట్కాలు :
- ఎక్కువగా నీళ్లు త్రాగడం
- పడిగడపున గోరు వెచ్చని నీళ్లు తీసుకోవాలి లేదా గోరు వెచ్చని నీటితో తేనె కలుపుకొని త్రాగడం
- రాత్రి పడుకునే ముందు పాలు, నిమ్మ రసం లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
- ఎక్కువగా పీచు ఉన్న ఆహార పదార్థాలు ( గ్రైన్స్ , నట్స్, పండిన అరటి పండు, ఆపిల్, జామ కాయ, బొప్పాయి పండు, నాన పెట్టిన అంజీర్ , దానిమ్మ పండు)
- ప్రతి రోజు వ్యాయామము చేయడం వలన మలబద్దకం రాకుండా నివారించవచ్చు.
మలబద్దకం – ఆయుర్వేద చిట్కాలు :
- త్రిఫల చూర్ణన్ని తీసుకోవడం
- గాంధర్వ హరి తాకి
- అభ్యాగ రిస్తా
- పంచముఖ చూర్ణం తీసుకోవడం వలన కూడా మలబద్దకం తగ్గుతుంది.
మలబద్దకం – యోగా ఆసనాలు :
- భుజంగాసనం
- వజ్రాసనం
- ధనుర్ ఆసనం లాంటివి చేసిన కూడా మలబద్దకం తగ్గుతుంది.
మలబద్దకం వచ్చినపుడు తినకూడని ఆహార పదార్థాలు :
- మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలు ( బ్రెడ్, పాస్తా, పిజ్జా )
- ప్రోటీన్లు ఎక్కువగా ఆహార పదార్థాలు ( చీస్, రెడ్ మీట్, సోయా చిక్కుడు ) లాంటి ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
మలబద్దకం నిర్ధారణ పరీక్షలు :
మలబద్దకం చాలా రోజుల నుంచి ఉండి అలాగే వీటితో పాటు బరువు తగ్గడం ,మలంలో రక్తం రావడం లాంటి లక్షణాలు ఉన్నట్లయితే కొన్ని నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
- స్టూల్ కల్చర్
- CBP
- ఎలక్ట్రో లైట్ ప్యానల్
- మూత్ర పరీక్ష
- థైరాయిడ్ టెస్ట్
మలబద్దకం చికిత్స విధానం :
- ఎక్కువగా నీళ్లు త్రాగడం
- పీచు ఎక్కువగా ఆహార పదార్థాలు తీసుకోవడం
- వ్యాయామం చేయడం
- వీటితో తగ్గానట్లయితే మెడిసిన్ తీసుకోవాలి. మెడిసిన్ లో
- Lactulose ( 15-30 ml for 1-2 Days ) ,
- Psyliium Husk ,
- Poly Ethylene Glycol ( Miralax ) ,
- Sodium Pico Sulphate ( Cremafin, Cremalox )
- Bisacodyl ( Dulxolex ) ,
- Lubipristone( Lubilox ),
- Linoclotide ,
- Prucolpride,
- Colchicine,
- Alvimopan ,
- Milk Of Magnesia లాంటి మెడిసిన్ తీసుకోవాలి.