బీపీ అంటే ఏమిటి ?
* సాదరణంగా గుండె నుంచి రక్తం అనేది రక్తనాళాల ద్వారా వివిధ అవయవాలకు సరఫరా అవుతూ ఉంటుంది . ఈ రక్తనాళాలలో రక్తం ఎంత ప్రెషర్తో వెళ్తుంది అని కొలిచేదే బ్లడ్ ప్రెషర్.
* బీపీ టాబ్లెట్స్ అనేవి చాలా చోట్ల పని చేస్తూ ఉంటాయి. మనం ఏ పని చేయాలన్నా మెదడు నుంచి సంకేతాలు వస్తాయి, కాబట్టి కొన్ని బిపి టాబ్లెట్స్ మెదడులో పనిచేస్తాయి.
* రక్తం అనేది గుండె నుంచి సరఫరా అవుతుంది కాబట్టి కొన్ని టాబ్లెట్స్ గుండె దగ్గర పని చేస్తాయి.
* రక్తం రక్తనాళాల నుంచి వెళుతుంది కాబట్టి కొన్ని బిపి టాబ్లెట్స్ రక్తనాళాల పైన పనిచేస్తూ ఉంటాయి.
* అలాగే మరికొన్ని టాబ్లెట్స్ కిడ్నీలో పనిచేస్తాయి. కిడ్నీస్ రక్తం యొక్క వాల్యూమ్ ని సరిపడా చూడడానికి కిడ్నీ సహాయపడుతూ ఉంటుంది
బిపి టాబ్లెట్స్ రకాలు :
సెంట్రల్ సింపాతోలైటిక్స్ ( Central Sympatholytics ) :
సెంట్రల్ సింపాతోలైటిక్స్ ( Central Sympatholytics ) టాబ్లెట్స్ అనేవి మెదడులో పని చేస్తాయి. వీటిలో clonidine, Methyl Dopa ఉంటుంది. ఈ సెంట్రల్ సింపాతోలైటిక్స్ ( Central Sympatholytics ) మెదడులో పనిచేసి మెదడు నుంచి కొన్ని సంకేతాలను గుండెకి వెళ్తాయి. గుండె యొక్క హార్ట్ రేట్ అలాగే రక్తనాళాల యొక్క వెడల్పు పెంచడానికి ఈ సెంట్రల్ సింపాతోలైటిక్స్ ( Central Sympatholytics ) ఉపయోగపడతాయి. ఇలా చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గించవచ్చు.
ఈ సెంట్రల్ సింపాతోలైటిక్స్ ( Central Sympatholytics ) టాబ్లెట్స్ వలన మత్తుగా ఉండడం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ టాబ్లెట్స్ ఎక్కువగా వైద్యులు ఉపయోగించరు.
బీటా బ్లాకర్స్ ( Beta Blockers ) :
ఈ బీటా బ్లాకర్స్ గుండె దగ్గర పని చేస్తాయి. గుండె యొక్క హార్ట్ రేట్ ,అలాగే కార్డియాక్ కాంట్రాక్టులిటి తగ్గించడం ద్వారా కార్డియాక్ అవుట్ పుట్ తగ్గిస్తూ ఉంటుంది. దీని వలన బ్లడ్ ప్రెషర్ తక్కువ చేయడానికి సహాయపడుతుంది.
ఈ బీటా బ్లాకర్స్ లో ప్రోప్రాణాలాల్ (Propronalol) , మెటప్రోలాల్( Metapralol), అతినలాల్( Atenalol) ఉంటాయి. వైద్యులు ఎక్కువగా మెటాప్రాలాల్ ఉన్న మెడిసిన్ నీ బీపీ తగ్గించడానికి ఉపయోగిస్తారు.
ఆల్ఫా బ్లాకర్స్ ( Alpha Blockers ) :
ఆల్ఫా బ్లాకర్స్ రక్తనాళాల దగ్గర పనిచేస్తాయి .రక్తనాళాల యొక్క వెడల్పు పెంచడానికి సహాయపడతాయి. ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ ని తగ్గించవచ్చు .ఆల్ఫా బ్లాకర్స్ లో ప్రాజోసిన్( Prazosin), డాక్సాజోసిన్ ( Doxazocin) ఉంటాయి. కానీ ఈ ఆల్ఫా బ్లాకర్స్ ఉపయోగించడం వల్ల టకీకార్డియా, గుండె వేగంగా కొట్టుకొనే దుష్ప్రభావం ఉండవచ్చు అందువలన ఎక్కువగా వైద్యులు ఆల్ఫా బ్లాకర్స్ ఉపయోగించరు.
ఆల్ఫా ప్లస్ బీటా బ్రోకర్స్ ( Alpha and Beta Blockers ) :
ఆల్ఫా ప్లస్ బీటా బ్రోకర్స్ ( Alpha and Beta Blockers ) లో లాబీటలాల్ ( Labetalol) ,కార్విడలాల్( Carvedilol ) ఉంటాయి. ఈ టాబ్లెట్స్ ఎవరికైతే రక్తపోటుతో పాటు గుండె సంబంధిత ఇబ్బంది ఉంటుందో ,అలాంటి వారిలో ఈ టాబ్లెట్స్ ఉపయోగిస్తారు.
క్యాల్షియం ఛానల్ బ్లాకర్స్ ( Calcium Channel Blockers ) :
క్యాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనేవి వాసో డైలేటర్స్. రక్తనాళాలను వెడల్పు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రక్తనాళాల యొక్క వెడల్పు పెరగడం వలన బ్లడ్ ప్రెషర్ తగ్గించవచ్చు .ఈ క్యాల్షియం ఛానల్ బ్లాకర్స్ లో నైస్డేపిన్( Nifedepine), ఆమ్లో డిపిన్ ( Amlodipine), వేరాపామిల్ ( Verapamil), డిల్టియజెం ( Diltiazem) ఉంటాయి.
ఆమ్లోడిపిన్ ( Amlodipine) ఎక్కువగా ఉపయోగించే బి.పి టాబ్లెట్ . కానీ ఈ ఆమ్లో డిపిన్ ( Amlodipine) ఉపయోగించడం వలన కొన్ని దుష్ప్రభవాలు ఉంటాయి. ఎక్కువగా తలనొప్పి, కాళ్లవాపు ,చిగుళ్ల వాపు, వచ్చే అవకాశం ఉంటుంది.
ఆర్టీరియల్ వాసొ డైలేటర్స్ ( Arterial Vasodilators) :
మినాక్సిడిల్ ( Minoxidil), హైడ్రా లెజిన్ (Hydralazine) అనేవి కూడా బి.పి. తగ్గించడానికి సహాయపడుతుంది.
నైట్రో డైలేటర్స్ ( Nitrodilators) :
నైట్రో డైలేటర్స్ ( Nitrodilators) లో సోడియం నైట్రో ప్రొసైడ్, నైట్రో గ్లిజరిన్ ఉంటాయి. ఈ నైట్రో డైలేటర్స్ ( Nitrodilators) ఉపయోగించడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనేది బయటకి వస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎవరికైతే సర్జరీ చేసే సమయంలో అమాంతం బీపీ ఎక్కువ అవుతుందో ( Acute Hypertensive Crisis)అలాంటి క్లిష్ట పరిస్థితులులో బీపీని తగ్గించడానికి ఈ నైట్రో డైలేటర్స్ ( Nitrodilators) వైద్యులు ఉపయోగిస్తారు.
డై యూరిటిక్స్ ( Diuretics ) :
Thiazide Diuretics ఉన్న హైడ్రో క్లోరో తయాసైడ్ ( Hydro Chloro Thiazide) , క్లోర్ తాలిడోన్ (Chlor Thalidone ) బిపిని తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఆంజియోటెన్సన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ (Angiotensin Converting Enzyme Inhibitors ) :
ఆంజియోటెన్సన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ (Angiotensin Converting Enzyme Inhibitors ) లో కాప్టప్రిల్ (Captopril), ఎనాలాప్రిల్ ( Enalapril), లిసినాప్రిల్( Lisinopril) ఉంటాయి. ఈ టాబ్లెట్స్ ఎక్కువగా కిడ్నీ దగ్గర పనిచేస్తాయి. సోడియం అలాగే వాటర్ కిడ్నీ ద్వారా ఎక్కువగా బయటకు పంపించడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గించవచ్చు.
అంజీయో టెన్సిన్ రిసెప్టార్ బ్లాకార్స్ ( Angiotensin Receptor Blockers :
అంజీయో టెన్సన్ రిసెప్టార్ బ్లాకార్స్ ( Angiotensin Receptor Blockers ) లో లోసర్టాన్ ( Losartan) , వాల్సార్టన్ (valsartan), టెల్మి సార్తన్ (telmisartan) ఉంటుంది. ఈ టాబ్లెట్స్ కూడా కిడ్నీ దగ్గర పని చేస్తాయి. ఎవరికైతే రక్తపోటుతో పాటు షుగర్ వ్యాధి ఉంటుందో అలాంటి వారిలో ఈ టాబ్లెట్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు .
మరింత సమాచారానికి క్రింది విడియో చూడండి :
Usefull message