* బార్లీ నీళ్ళలో చాలా పోషక విలువలు ఉంటాయి. వీటిలో పీచు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అలాగే ప్రతి రోజు తీసుకోవడం వలన జీర్ణం త్వరగా అవుతుంది.
* బార్లీ నీళ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
* అలాగే ఇది ప్రతి రోజు తీసుకోవడం వల్ల ,బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, గుండె సంబంధిత వ్యాధి రాకుండా నివారించవచ్చు.
* బార్లీ లో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల దృఢత్వానికి ఇవి చాలా సహాయపడుతూ ఉంటాయి.
* బార్లీ నీళ్లు ప్రతి రోజు తీసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రంలో మంట, మూత్రానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది లాంటి లక్షణాలు ఉన్నవారికి బార్లీ చాలా సహాయ పడుతుంది.
* కిడ్నీలో రాళ్లు ,పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారికి అలాగే రక్తంలో క్రియాటినైన్ లెవెల్స్ తగ్గించడానికి ఇవి చాలా సహాయపడుతూ ఉంటాయి.
బార్లీ నీళ్ళు ఏ సమయంలో తీసుకోవాలి ?
బార్లీ నీళ్లు ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు కానీ పడుకునే ముందు తీసుకుంటే చాలా మంచిది..
బార్లీ నీళ్లు ఎలా తయారు చేసుకోవాలి ?
* బార్లీ నీళ్లు తయారు చేసుకోవడానికి ఒక కప్పు బార్లీ తీసుకోవాలి , వీటిని బాగా కడగాలి.
* ఇలా కడిగిన తర్వాత ఎనిమిది కప్పు నీళ్ళులో ఒక కప్పు బార్లీ వేసి ఈ నీళ్లను బాగా మరిగించాలి
* ఆ తర్వాత పది నిమిషాలు సిమ్ లో పెట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల బార్లీ లో ఉన్న పోషక విలువలు అన్ని ఈ నీళ్లలో వెళ్తాయి.
* ఈ నీళ్లు చల్లారిన తర్వాత వడపోయాలి అలాగే ఈ వడపోసిన నీళ్లలో ఒక నిమ్మకాయ రసం అలాగే కొద్దిగా తేనె కలిపి తాగాలి.
బార్లీ నీళ్లు ఎవరు తీసుకోకూడదు ?
* కొందరికి బార్లీ నీళ్లు తాగడం వలన అలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి వారికి గాబరావడం, కడుపులో నొప్పి, వాంతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
* అలాగే బార్లీ నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరింత సమాచారానికి క్రింది విడియో చూడండి :