ఫ్యాటీ లివర్ రావడానికి గల కారణాలు ,లక్షణాలు చికిత్స విధానం|Grades of Fatty Liver ,Causes , Symptoms and Treatment.

కాలేయం శరీరం యొక్క పైన కుడి భాగంలో ఉంటుంది. కాలేయంలో కొవ్వు చేరితే ఆ సందర్భాన్ని ఫ్యాటీ లివర్ అంటారు.

ఫ్యాటీ లివర్ ఎక్కువగా మనం పొట్టకి అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా కిడ్నీలో రాళ్లు, పిత్తాశయంలో రాళ్లు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చేసే స్కాన్ లో ఫ్యాటీ లివర్ అనే పదం చూస్తాము.

ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో తరచుగా వచ్చే ఇబ్బంది అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ ను నివారించవచ్చు.

అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఫ్యాటీ లివర్ ని నాలుగు గ్రేడ్ గా విభజించారు.

* గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ లో కొద్దిగా కొవ్వు ఉంటే గ్రేడ్ వన్ అంటారు.

* గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ లో మాధ్యమంగా కొవ్వు చేరితే గ్రేడ్ 2 ఉంటుంది

* గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ లో తీవ్రమైన కొవ్వు కాలేయంలో ఉంటుంది.

ఫ్యాటీ లివర్ రావడానికి కారణాలు :

  • బరువు ఎక్కువగా ఉన్నవారు
  • స్థూలకాయం
  • షుగర్ ఎక్కువగా ఉన్నవారు
  • కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు

ఫ్యాటీ లివర్ లక్షణాలు :

ఫ్యాటీ లివర్ ని “సైలెంట్ డిసీస్” అని కూడా అంటారు ఎందుకంటే ఈ ఫ్యాటీ లివర్ తీవ్రత వచ్చేవరకు ఎటువంటి లక్షణాలు కనబడవు.

  • తొందరగా అలసిపోవడం
  • లివర్ ఉన్నచోట నొప్పి ఉండడం
  • వాంతులు
  • పొట్ట భాగంలో నీరు చేరడం ( అసైటిస్ )
  • తీవ్రంగా ఉన్నట్లయితే జాండీస్ లక్షణాలు చర్మం పసుపు పచ్చగా మారడం కళ్ళు పసుపు పచ్చగా ఉండడం.

ఫ్యాటీ లివర్ నిర్ధారణ పరీక్షలు :

  • లివర్ ఫంక్షన్ టెస్ట్
  • లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్
  • బ్లడ్ షుగర్ టెస్ట్
  • ఫైబ్రో స్కాన్

ఫ్యాటీ లివర్ చికిత్స విధానం :

ఈ యొక్క చికిత్స అనేది ఫ్యాటీ లివర్ రావడానికి గల కారణం ప్రకారం ఉంటుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గించుకోవడం, రక్తపోటు అదుపులో ఉంచుకోవడం ,కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం తీవ్రంగా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి.

ఫ్యాటీ లివర్ నివారణ చర్యలు :

  • షుగర్ తగ్గించుకోవాలి
  • బరువు తగ్గించుకోవాలి
  • వ్యాయామం చేయడం
  • బయట ఆహారపు పదార్థాలు తినడం తగ్గించాలి
  • మద్యపానం తగ్గించడం
  • తీపి ఎక్కువగా ఉన్న పదార్థాలు అలాగే ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం తగ్గించాలి
  • ఆకుకూరలు తినడం చేయాలి

మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి :

ఫ్యాటీ లివర్ రావడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స విధానం.

Leave a Comment